రూ. 30 కోసం హత్య! | Man murdered seeking of Rs 30 | Sakshi

రూ. 30 కోసం హత్య!

Aug 20 2015 7:39 PM | Updated on Sep 3 2017 7:48 AM

తాగిన మైకంలో కేవలం రూ. 30 కోసం ఒకరి ప్రాణాలు బలిగొన్న ఘటన బేలమండలం సిర్సన్న గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

బేల(ఆదిలాబాద్) : తాగిన మైకంలో కేవలం రూ. 30 కోసం ఒకరి ప్రాణాలు బలిగొన్న ఘటన బేలమండలం సిర్సన్న గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్ర నుంచి 12 ఏళ్ల క్రితం డాకురే శ్యాంరావు(32) సిర్సన్న గ్రామానికి వలస వచ్చాడు. గ్రామంలో ఉంటూ కూలీ పని చేస్తున్నాడు.

మహారాష్ట్రలోని యావత్‌మాల్ ప్రాంతం నుంచి రెండు వారాల క్రితం వచ్చిన శ్యాంరావు మేన బావమరిది డాకే మనోహర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నాడు. ఇద్దరు కలిసి బుధవారం మద్యం తాగి గొడవపడ్డారు. తనకు ఇవ్వాల్సిన రూ.30 తనకివ్వాలంటూ మనోహర్, శ్యాంరావు గొంతునొక్కాడు. దీంతో శ్యాంరావు స్పృహ కోల్పోయాడు. అనంతరం శ్యాంరావును ఇంటికి తీసుకెళ్లి మంచంపై పడుకోబెట్టగానే మృతిచెందాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement