
అమీషా పటేల్ (Ameesha Patel).. బాలీవుడ్‌లో అనేక సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో బద్రి, నాని, నరసింహుడు, పరమవీరచక్ర చిత్రాల్లో నటించింది. ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న ఆమె గదర్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. గతేడాది తాబ తెర జల్వ సినిమాలో మెప్పించింది. తాజాగా ఆమె బాలీవుడ్ హీరో కమ్ విలన్ సంజయ్‌దత్ (Sanjay Dutt)తో ఉన్న అనుబంధాన్ని చెప్పుకొచ్చింది.
ఆయన ఇంట్లో కురచ దుస్తులు నిషిద్ధం
అమీషా పటేల్ మాట్లాడుతూ.. సంజయ్ ఇంటికి నేను సల్వార్, చుడీదార్ వేసుకునే వెళ్లాలి. పొట్టి బట్టలు, వెస్ట్రన్ దుస్తులు వేసుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. నాపై ఎంతో అభిమానం కురిపించేవాడు. నువ్వు చాలా అమాయకురాలివి, ఈ సినీపరిశ్రమలో ఎలా ఉంటావో.. ఏంటో.. అని పదేపదే అంటుండేవాడు. అంతేకాదు నాకోసం మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తానన్నాడు, కన్యాదానం కూడా అతడే చేస్తానని చెప్పాడు.

నేనంటే వల్లమాలిన ప్రేమ
ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నన్నెప్పుడూ జాగ్రత్తగా చూసుకునేవాడు. నా యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడు. చాలాసార్లు సంజు ఇంట్లోనే నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అమీషాకు ఇప్పుడు 49 ఏళ్లుకాగా ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. సంజయ్ దత్-అమీషా పటేల్.. తథాస్తు, చతుర్ సింగ్ టు స్టార్ సినిమాల్లో కలిసి నటించారు. సంజయ్ దత్ విషయానికి వస్తే.. ఆయన చివరగా డబుల్ ఇస్మార్ట్ మూవీలో కనిపించాడు. ప్రస్తుతం ద భూతిని అనే హారర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది
చదవండి: ఇంకా ఎందుకు బతికున్నావ్.. ఎలుకల మందు తిను అన్నారు: నటుడు
Comments
Please login to add a commentAdd a comment