హైదరాబాద్‌కు ఆదిపురుష్‌ | Prabhas Adipurush to be shot in Hyderabad due to Covid-19 | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌కు ఆదిపురుష్‌

Published Sat, May 8 2021 4:09 AM | Last Updated on Sat, May 8 2021 4:09 AM

Prabhas Adipurush to be shot in Hyderabad due to Covid-19 - Sakshi

‘ఆదిపురుష్‌’ హైదరాబాద్‌కు షిఫ్ట్‌ కానున్నాడు. ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో కృతీ సనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్‌ ఇటీవల ముంబయ్‌లో ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ‘ఆదిపురుష్‌’ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు ఈ చిత్రదర్శకుడు ఓం రౌత్‌. ఇప్పటికే షూటింగ్‌కి కావాల్సిన ఏర్పాట్లు, సెట్‌ వర్క్‌ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. అంతేకాదు.. ఈ కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ఈ నెల 15న ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌ 45 రోజులకు పైగా కొనసాగుతుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement