
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్'. జూన్ 16న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలిరోజే మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో సినీ విమర్శలకు ఆగ్రహానికి గురైంది. ఈ చిత్రంలోని కొన్ని పాత్రలు, డైలాగ్స్‌పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
(ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!)
అంతేకాకుండా సీత భారత్‌లో జన్మించినట్లు చూపించడంపై నేపాల్‌లో నిరసన వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమాలపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆదిపురుష్ టీం వారిని క్షమాపణలు కోరింది. అయితే ఈ చిత్రంలో సీత పాత్రలో కృతి సనన్ నటించింది. ఈ చిత్రంలోని పాత్రలపై వస్తున్న విమర్శలపై తాజాగా కృతి సనన్ తల్లి గీతా సనన్ స్పందించింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ మేసేజ్ పోస్ట్ చేసింది.
ఇన్‌స్టాలో గీతా సనన్ రాస్తూ.. 'ప్రజలు ఒక నిర్దిష్ట విషయాన్ని మంచి మనస్తత్వం, ఆలోచనతో చూడాలి. మనం సరైన దృక్పథంతో చూసినప్పుడే మనకు ప్రపంచం అందంగా కనిపిస్తుంది. మనకు భగవంతుడు రాముడు ప్రేమను పంచమని ప్రజలకు బోధించాడు. శబరి రామునికి అందించిన ప్రేమను చూడాలి కానీ.. ఆ వ్యక్తి తప్పులను చూడకూడదు. ఎదుటి వారి భావోద్వేగాలను మనం అర్థం చేసుకోవాలి. జై శ్రీరామ్' అంటూ పోస్ట్ చేశారు.
(ఇది చదవండి: శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల‍్లోకి 28 సినిమాలు!)