shootings disrupted
-
హైదరాబాద్‌కు ఆదిపురుష్
‘ఆదిపురుష్’ హైదరాబాద్‌కు షిఫ్ట్ కానున్నాడు. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్’. ఇందులో కృతీ సనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండో షెడ్యూల్ ఇటీవల ముంబయ్‌లో ముగిసింది. మూడో షెడ్యూల్‌ను కూడా అక్కడే చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ‘ఆదిపురుష్’ తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రదర్శకుడు ఓం రౌత్. ఇప్పటికే షూటింగ్‌కి కావాల్సిన ఏర్పాట్లు, సెట్ వర్క్ పనులు ఓ కొలిక్కి వచ్చాయట. అంతేకాదు.. ఈ కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ఈ నెల 15న ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ 45 రోజులకు పైగా కొనసాగుతుందని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదలకానుంది. -
ఐదు రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగులు
టాలీవుడ్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఐదు రోజులుగా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతలు తెరమీదకు తీసుకొచ్చారు. అయితే, దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్‌లోనూ ఈ క్లాజు లేదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాదిస్తోంది. ఈ క్లాజు అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు తాము ఫెడరేషన్ చెప్పినట్లే చేశామని, ఇకమీదట కూడా అలాగే చేస్తూ పోతుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈవివాదం ఇంకా ఎటూ తేలకుండానే ఆగిపోయింది.