ఐదు రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగులు
టాలీవుడ్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ మధ్య వార్ మళ్లీ మొదలైంది. ఇప్పటికే ఐదు రోజులుగా షూటింగులన్నీ ఆగిపోయాయి. దీంతో ఈ కేసును లేబర్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా సీసీఐ అనే కొత్త క్లాజును నిర్మాతలు తెరమీదకు తీసుకొచ్చారు. అయితే, దక్షిణభారత దేశంలోని ఏ ఫెడరేషన్లోనూ ఈ క్లాజు లేదని తెలుగు ఫిలిం ఫెడరేషన్ వాదిస్తోంది.
ఈ క్లాజు అమలుచేస్తే తమ జీవితాలు రోడ్డున పడతాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పటివరకు తాము ఫెడరేషన్ చెప్పినట్లే చేశామని, ఇకమీదట కూడా అలాగే చేస్తూ పోతుంటే మాత్రం భారీగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు తెలిపారు. దీంతో ఈవివాదం ఇంకా ఎటూ తేలకుండానే ఆగిపోయింది.