సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది.
కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది.
Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp
— Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022
చదవండి:
అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి
Comments
Please login to add a commentAdd a comment