2022 Tollywood Shootings Bandh: These Movies Will Be Affected, Check List Here - Sakshi
Sakshi News home page

Tollywood Shootings: స్టార్‌ హీరోల సినిమాలకు పెద్ద షాకే ఇది..

Published Tue, Jul 26 2022 6:53 PM | Last Updated on Tue, Jul 26 2022 7:33 PM

Tollywood Shootings Bandh: These Movies Will Be Affected - Sakshi

టాలీవుడ్‌లో షూటింగ్‌లు బంద్‌ కానున్నాయంటూ కొన్నిరోజులుగా ఊరిస్తున్న ఊహాగానాలు నిజమే అయ్యాయి. ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌కు బ్రేక్‌ పడనుంది. దీంతో పెద్ద సినిమాలన్నీ వాయిదా పడే అవకాశం ఉంది. అటు ఓటీటీ రిలీజ్‌పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌.

భారీ బడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్‌ అంశంపై ఫెడరేషన్‌తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది.

షూటింగ్స్‌ బంద్‌తో ఎఫెక్ట్‌ అయ్యే పెద్ద సినిమాలివే..
► బాబీ - చిరంజీవి సినిమా
► గాడ్‌ ఫాదర్‌
► మెహర్‌ రమేశ్‌- చిరంజీవి
► గోపీచంద్‌ మలినేని- బాలకృష్ణ (NBK107)
► హరిహర వీరమల్లు
► శంకర్‌- రామ్‌చరణ్‌ (RC15)
► వంశీ పైడిపల్లి- విజయ్‌
► ఖుషీ
► యశోద
► ఏజెంట్‌

ఇవి కాకుండా పుష్ప2, భవదీయుడు భగత్‌ సింగ్‌, త్రివిక్రమ్‌- మహేశ్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ, కొరటాల శివ- తారక్‌ కాంబినేషన్‌లోని భారీ చిత్రాలు సెట్స్‌కు వెళ్లేందుకు రెడీ అవుతుండగా తాజా నిర్ణయంతో వాటికి ఆదిలోనే ఆటంకం ఏర్పడినట్లయింది.

చదవండి: ఆగస్టు 1 నుంచి సినిమా షూటింగ్స్‌ బంద్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement