Telugu Film Federation
-
సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతల మండలి కీలక ప్రకటన
సినీ కార్మికుల వేతనాల పెంపుకు చలన చిత్ర నిర్మాతల మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కార్మికుల డిమాండ్ మేరకు వేతనాలను 30 శాతం పెంచుతున్నట్లు తాజాగా ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి, ఫలిం ఫెడరేషన్ సంయుక్తంగా అధికారిక ప్రకటన ఇచ్చింది. పెద్ద సినిమాలకు 30 శాతం, చిన్న సినిమాలకు 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు అధికారిక ప్రకటన ఇచ్చాయి. ఇక ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా అనేది ఫిలిం చాంబర్, ఫెడరేషన్ కలిసి నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఈ తాజా వేతనాల పెంపు సవరణ అనేది 01-07-2022 నుంచి 30-06-2025 వరకు అమలవుందని నిర్మతల మండలి స్పష్టం చేసింది. కాగా ప్రతి మూడేళ్లకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉండగా కరోనా కారణంగా నిర్మాతలు జాప్యం చేస్తూ వచ్చారని, ఈ సారి వేతనాలు సవరించి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఫిలిం ఫెడరేషన్ సెప్టెంబర్ 1న నిర్మాతల మండలికి నోటిసులు ఇచ్చింది. అంతేకాదు తమ డిమాండ్ నెరవేర్చకపోతే సెప్టెంబర్ 16న మరోసారి సమ్మెకు వెళతామని హెచ్చరించింది. దీంతో నిర్మాతల మండలి.. వేతన కమిటీ ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని కార్మికుల వేతనాలను 30 శాతం విడతల వారిగా పెంచాలని నిర్ణయించింది. Telugu Film Industry PRESS NOTE#TFPC #TELUGUFILMPRODUCERSCOUNCIL #TFCC #TFI pic.twitter.com/7XBs9feYkp — Telugu Film Producers Council (@tfpcin) September 15, 2022 చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు రవి ప్రసాద్ మృతి -
సినీకార్మికుల సమ్మె సక్సెస్, వేతనాల పెంపుకు సమ్మతమే!
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపుకు దిల్ రాజు నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ జరుగుతాయి. కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. దిల్ రాజు చైర్మన్‌గా శుక్రవారం ఉదయం 11 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అవుతుంది' అని చెప్పారు. వేతనాల పెంపుపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హర్షం వ్యక్తం చేశారు. 'వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్ని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటాము. రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాము అని తెలిపారు. చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపైత తాజాగా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఫిలిం చాంబర్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఇరువర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం దిశగా మాట్లాడుకోని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన ఈ క్రమంలో చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తాజాగా ఫిలిం చాంబర్లో భేటీ అయ్యి సినిమా కార్మికుల సమ్మె, సినిమా షూటింగ్స్, వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశానికి సి కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, ప్రసన్న కుమార్, కిరణ్, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు తదితరలు హజరయ్యారు. చదవండి: సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు -
సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఫిలించాంబర్ ఎదుట ఆందోళన చేపట్టిన సినీ కార్మికులు షూటింగ్‌లను సైతం బహిష్కరించారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాట్లాడుతూ.. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరారని, కానీ ఆ గడువు ముగియడంతో వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దని హితవు పలికారు. మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. కానీ దానికంటే ముందే వేతనాలపై ఫిలిం ఛాంబర్ ఆలోచిస్తోంది. ఇంతలోనే ఫిలిం ఫెడరేషన్ ఇలా సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం చాలా తప్పు. షూటింగ్‌లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్‌కు హాజరుకావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. మీకు ఐదు కండీషన్స్ పెడుతున్నాం. 1. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. 2. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. 3. అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం. 4. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. 5. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే తామే షూటింగ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ -
సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన
సినీ కార్మికుల సమ్మెపై తాజా సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు సినీ కార్మికులంతా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూడేళ్లు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బుందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్తా మెరుగుపడుతున్న సమంయలో సమ్మెబాట పట్టడం సరికాదని అన్నాడు. చదవండి: హెల్త్అప్డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు ‘తెలుగు సినిమా బిడ్డలందరి నమస్కారం. నిన్నటి నుంచి టీవీలన్ని కూడా మారుమోగిపోతున్నాయి. షూటింగ్‌లు ఆగిపోతాయని, ఒకటి, రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే. పెద్దలందరు కలిసి ఇండిస్ట్రీపై నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. అయితే అందరు ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకుపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట గడవ నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కూడా కొల్పోయారు. ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కాస్తా వెంటిలేటర్‌పై ప్రాణం పోసుకుని సినిమాలు రిలీజ్అవుతున్నాయి. మన సినీ పరిశ్రమకు మంచి పేరు కూడా వస్తుంది. మనందరికి బ్యాంకులు నిండకపోయిన కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో మనమందరం కూడా ఆలోచించాలి. అన్నింటికి పరిష్కారం ఉంటుంది. నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొత్తం మునిగిపోతామండి అంటూ నాకు దర్శక-నిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే మరో ట్వీట్లో ‘నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే. వేతనాలు ఎంతోకొంత పెంచాలి. అది వారి డిమాండ్. అయితే నిర్మాతలు కూడా కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు నష్టపోయారు. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లిగా స్థిరపడుతున్నారు. The media is buzzing with news that a few unions have pressurised the federation of TFI to stop shootings with immediate effect. It is our right to ask for a raise in wages. (1/3) — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 చదవండి: Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఓ వారం, పది రోజులు టైం తీసుకుని అటూ ఫెడరేషన్‌కి, ఇటూ నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం. కృష్ణానగర్‌కి, ఫిలింనగర్‌కి 3 కిమీ దూరమే ఉంది. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మనందరం కలిస్తేనే ఒక కుటుంబం. ఇండస్ట్రీ బిడ్డగా నావంతుగా నేరు ఏం చేయలో ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. పెద్దలు అందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమని మరొకసారి అంధకారంలోకి వెళ్లకుండ ఆపి ఈ యొక్క షూటింగ్‌లు ఇంకోన్ని రోజులు ముందుకు సాగేలా అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను’ అని నరేశ్ వ్యాఖ్యానించాడు. A knee-jerk stop will crush not only the producers but also the lower financial strata members who are the majority. As a son of the TFI it is my humble appeal to go slow on the lockdown & negotiate. Kindly cooperate with the federation & producers to avert a major crisis🙏 (3/3) pic.twitter.com/TwLa0iYvzW — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022 -
వేతనాల పెంపుపై స్పందించడం లేదు: సినీకార్మికులు
-
సినీ కార్మికుల సమ్మె: ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత
టాలీవుడ్లో నేటి(జూన్ 22)నుంచి సినిమా షూటింగ్స్ నిలిచిపోయాయి. వేతన పెంపు కోరుతూ సినీ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ వేతనాలు పెంచాలని సిని కార్మికులు గత కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై నిర్మాతల మండలి స్పందించకోవడంతో సినీ కార్మికులు షూటింగ్స్‌కి హాజరు కాలేదు. ప్రతి మూడేళ్లకు ఒక్కసారి కార్మికుల వేతనాలు పెంచాల్సి ఉన్నప్పకీ.. నాలుగేళ్లు దాటినా వేతనాల ఊసే లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఇదిలా ఉండగా కాసేపట్లో 24 క్రాఫ్ట్స్ సభ్యుల సమావేశం జరగునుంది.ఈ నేపథ్యంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మొహరించారు. సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాత్రమే ఉండాలని పోలీసలు స్పష్టం చేశారు. కార్మికులెవరు గుమిగూడవద్దని హెచ్చిరంచారు. -
Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్
సినీ కార్మికులు నేడు సమ్మెకు దిగారు. వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు ఫిలిం చాంబర్ ఎదుట ఆందోలన చేపట్టారు. ఇందులో భాగంగా సినీ కార్మికులెవరకు షూటింగ్లో పాల్గొనలేదు. అంతేకాదు జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్లే బస్సులను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి కాగా వేతనాల పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నిన్న(మంగళవారం) ఫిల్మ్ చాంబర్, నిర్మాత మండలిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ కామర్స్ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫడరేషన్ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు. అయితే ఫేడరేషన్ ముందస్తు నోటిసులు ఇవ్వలేదు కాబట్టి బుధవారం యథావిధిగా నిర్మాతలు షూటింగ్‌లు చేసుకోవచ్చని రామకృష్ణ చెప్పారు. చదవండి: నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు ఇదిలా ఉంటే అధ్యక్షుడు రామకృష్ణ వ్యాఖ్యలను సినిమా కార్మికుల ఫెడరేషన్ ఖండిచింది. ఈ నెల 6వ తేదినే చాంబర్‌కు సమాచారం ఇచ్చామని చెబుతూ ఫెడరేషన్ సభ్యులు తాము ఇచ్చిన లేఖను మీడియాకు అందించారు. అందులో ఈ నెల 6వ దానిని ధృవీకరిస్తూ ఫిలిం చాంబర్‌కు లేఖ రాసినట్టుగా ఉంది. అంతేకాదు దానిని చాంబర్ స్వీకరించినట్లు కూడా ఉండటం గమనార్హం. వేతన సవరణ గుడువు కాలం పూర్తయి 13 నెలలు దాటిందని, వెంటనే వేతనాలను సవరించకపోతే 15 రోజుల తర్వాత కార్మికులు ఎవ్వరూ షూటింగ్స్ హజరు కాకుడదనే నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. అలాగే వెంటనే వేతన విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కూడా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పష్టం లేఖలో పేర్కొంది. -
సమ్మె సైరన్: టాలీవుడ్లో షూటింగ్స్ బంద్!
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్లో సమ్మె సైరన్ మోగింది. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నాడు 24 విభాగాల కార్మికులు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా రేపటినుంచి సినిమా షూటింగ్‌లకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం నాడు వెంకటగిరిలోని ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో సినీ కార్మిక సంఘాలతో ఫిలిం ఫెడరేషన్ చర్చలు జరిపింది. అనంతరం ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. 'వేతనాల పెంపుపై నిర్మాతల మండలి స్పందించడం లేదు. 24 విభాగాల్లోని ఒక్కో కార్మిక సంఘం నాయకులతో చర్చిస్తున్నాం. ప్రతీ మూడేళ్లకోసారి సినీ కార్మికుల వేతనాలు పెరగాలి. కానీ నాలుగేళ్లైనా సినీ కార్మికుల వేతనాలు పెంచలేదు. కార్మిక సంఘాలు ఫిల్మ్ ఫెడరేషన్‌పై ఒత్తిడి తెస్తున్నాయి' అని పేర్కొన్నారు. చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి విలన్‌గా మారుతున్న స్టార్ హీరోలు.. కొత్త కండీషన్ అప్లై -
రేపట్నుంచి సినిమా షూటింగ్ లు బంద్: ఫిలిం ఫెడరేషన్
హైదరాబాద్: సోమవారం నుంచి సినిమా షూటింగ్ లు బంద్ పాటించాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. రేపట్నుంచి వారం రోజులపాటు బంద్ కొనసాగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. నిర్మాతలు, ఫెడరేషన్ ల మధ్య చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఏ ఆర్టిస్టు షూటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదని ఫెడరేషన్ ప్రతినిధులు తెలిపారు. సినీ ఆర్టిస్టులకు ఫ్యాక్స్ ద్వారా మేసేజ్ పంపినట్టు తెలుగు ఫిలిం ఫెడరేషన్ తెలిపింది.