సినీ కార్మికుల సమ్మెపై తాజా సీనియర్ నటుడు నరేశ్ స్పందించాడు. వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో నేడు సినీ కార్మికులంతా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. దీంతో సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో నటుడు నరేశ్ సోషల్ మీడియా వేదికగా వీడియోలు షేర్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా మూడేళ్లు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బుందులు ఎదుర్కొందని, ఇప్పుడిప్పుడే కాస్తా మెరుగుపడుతున్న సమంయలో సమ్మెబాట పట్టడం సరికాదని అన్నాడు.
చదవండి: హెల్త్‌అప్‌డేట్: ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు
‘తెలుగు సినిమా బిడ్డలందరి నమస్కారం. నిన్నటి నుంచి టీవీలన్ని కూడా మారుమోగిపోతున్నాయి. షూటింగ్‌లు ఆగిపోతాయని, ఒకటి, రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారు. మంచిదే. పెద్దలందరు కలిసి ఇండిస్ట్రీపై నిర్ణయం తీసుకోవాలి, తీసుకుంటారు కూడా. అయితే అందరు ఒకటి గుర్తుంచుకోవాలి. గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకుపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట గడవ నానా ఇబ్బందులు పడ్డారు. అంతేకాదు వైద్య ఖర్చులు లేక చాలా మంది ప్రాణాలు కూడా కొల్పోయారు.
ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమ కాస్తా వెంటిలేటర్‌పై ప్రాణం పోసుకుని సినిమాలు రిలీజ్‌అవుతున్నాయి. మన సినీ పరిశ్రమకు మంచి పేరు కూడా వస్తుంది. మనందరికి బ్యాంకులు నిండకపోయిన కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో మనమందరం కూడా ఆలోచించాలి. అన్నింటికి పరిష్కారం ఉంటుంది. నిన్నటి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మొత్తం మునిగిపోతామండి అంటూ నాకు దర్శక-నిర్మాతలు, కార్మికులు, నటీనటులు ఫోన్ చేస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. అలాగే మరో ట్వీట్‌లో ‘నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే. వేతనాలు ఎంతోకొంత పెంచాలి. అది వారి డిమాండ్. అయితే నిర్మాతలు కూడా కరోనా సమయంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు నష్టపోయారు. వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితులో ఉన్నారు. ఇప్పుడిప్పుడే మెల్లిగా స్థిరపడుతున్నారు.
The media is buzzing with news that a few unions have pressurised the federation of TFI to stop shootings with immediate effect.
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022
It is our right to ask for a raise in wages.
(1/3)
చదవండి: Film Employees Strike: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్
ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఓ వారం, పది రోజులు టైం తీసుకుని అటూ ఫెడరేషన్‌కి, ఇటూ నిర్మాతలకు ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి వద్దాం. కృష్ణానగర్‌కి, ఫిలింనగర్‌కి 3 కిమీ దూరమే ఉంది. అందరం కలిసి ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మనందరం కలిస్తేనే ఒక కుటుంబం. ఇండస్ట్రీ బిడ్డగా నావంతుగా నేరు ఏం చేయలో ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను. పెద్దలు అందరూ కలిసి కూడా నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమని మరొకసారి అంధకారంలోకి వెళ్లకుండ ఆపి ఈ యొక్క షూటింగ్‌లు ఇంకోన్ని రోజులు ముందుకు సాగేలా అందరం కలిసి ఒక అండర్‌స్టాండింగ్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను’ అని నరేశ్ వ్యాఖ్యానించాడు.
A knee-jerk stop will crush not only the producers but also the lower financial strata members who are the majority.
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 22, 2022
As a son of the TFI it is my humble appeal to go slow on the lockdown & negotiate. Kindly cooperate with the federation & producers to avert a major crisis🙏
(3/3) pic.twitter.com/TwLa0iYvzW
Comments
Please login to add a commentAdd a comment