సినీ కార్మికులు నేడు సమ్మెకు దిగారు. వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ 24 విభాగాలకు చెందిన కార్మికులు ఫిలిం చాంబర్ ఎదుట ఆందోలన చేపట్టారు. ఇందులో భాగంగా సినీ కార్మికులెవరకు షూటింగ్‌లో పాల్గొనలేదు. అంతేకాదు జూనియర్ ఆర్టిస్టులను తీసుకువెళ్లే బస్సులను సైతం ఫెడరేషన్ సభ్యులు నిలిపివేశారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.
చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
కాగా వేతనాల పెంపుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే తమ చేతుల్లో ఏమి లేదని ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నిన్న(మంగళవారం) ఫిల్మ్ చాంబర్, నిర్మాత మండలిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని తెలుగు ఫిల్మ్ చాంబర్ కామర్స్ నూతన అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ అన్నారు. ఫడరేషన్ నుంచి తమకు ఎలాంటి సమ్మె నోటీసులు రాలేదని, ఒకవేళ కార్మికులు సమ్మె చేయాలనుకుంటే 15 రోజుల ముందు నోటిసుల ఇవ్వాలని తెలిపారు. అయితే ఫేడరేషన్ ముందస్తు నోటిసులు ఇవ్వలేదు కాబట్టి బుధవారం యథావిధిగా నిర్మాతలు షూటింగ్‌లు చేసుకోవచ్చని రామకృష్ణ చెప్పారు.
చదవండి: నా వయసున్నోళ్లు లవ్‌స్టోరీస్ కూడా చేస్తున్నారు
ఇదిలా ఉంటే అధ్యక్షుడు రామకృష్ణ వ్యాఖ్యలను సినిమా కార్మికుల ఫెడరేషన్ ఖండిచింది. ఈ నెల 6వ తేదినే చాంబర్‌కు సమాచారం ఇచ్చామని చెబుతూ ఫెడరేషన్ సభ్యులు తాము ఇచ్చిన లేఖను మీడియాకు అందించారు. అందులో ఈ నెల 6వ దానిని ధృవీకరిస్తూ ఫిలిం చాంబర్‌కు లేఖ రాసినట్టుగా ఉంది. అంతేకాదు దానిని చాంబర్ స్వీకరించినట్లు కూడా ఉండటం గమనార్హం. వేతన సవరణ గుడువు కాలం పూర్తయి 13 నెలలు దాటిందని, వెంటనే వేతనాలను సవరించకపోతే 15 రోజుల తర్వాత కార్మికులు ఎవ్వరూ షూటింగ్స్ హజరు కాకుడదనే నిర్ణయం తీసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. అలాగే వెంటనే వేతన విషయంలో తగు నిర్ణయం తీసుకోవాలని కూడా ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ స్పష్టం లేఖలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment