సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపుకు దిల్ రాజు నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ జరుగుతాయి. కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. దిల్ రాజు చైర్మన్‌గా శుక్రవారం ఉదయం 11 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అవుతుంది' అని చెప్పారు.
వేతనాల పెంపుపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హర్షం వ్యక్తం చేశారు. 'వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్ని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటాము. రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాము అని తెలిపారు.
చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు!
యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం
Comments
Please login to add a commentAdd a comment