Producer C Kalyan
-
నాలుగేళ్లలో సర్వ నాశనం.. ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్‌పై సి.కల్యాణ్!
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చామని తెలిపారు. తొలిసారిగా నిర్మాతలకు మెడి క్లైమ్ తీసుకొచ్చింది తానేనని అన్నారు. అయితే నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. దాసరి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగానని వెల్లడించారు. (ఇది చదవండి: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్?) కానీ గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనమైందని విమర్శలు చేశారు. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తామని అన్నారు. ఈ సారి నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉందని కల్యాణ్ అన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ..' గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది. పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి. ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను. డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ' అంటూ విమర్శలు గుప్పించారు. ఫిల్మ్ ఛాంబర్ గురించి మాట్లాడుతూ..' ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్‌కు సేవ చేసేవాళ్లే కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు. ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల్లో పోటీపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్‌లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. దిల్ రాజు పక్కనున్నవాళ్లకు పోస్టులు కావాలి.' అని అన్నారు. (ఇది చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!) -
సినీకార్మికుల సమ్మె సక్సెస్, వేతనాల పెంపుకు సమ్మతమే!
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపుకు దిల్ రాజు నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ జరుగుతాయి. కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. దిల్ రాజు చైర్మన్‌గా శుక్రవారం ఉదయం 11 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అవుతుంది' అని చెప్పారు. వేతనాల పెంపుపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హర్షం వ్యక్తం చేశారు. 'వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్ని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటాము. రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాము అని తెలిపారు. చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
న్యాయమే నా ఆయుధం
‘‘నయీమ్‌తో మాకు సంబంధాలున్నాయని నీ (నట్టికుమార్) దగ్గర ఆధారాలుంటే చూపించు. వాటిని పోలీసులకి చూపించి, మా తప్పుందని రుజువైతే శిక్షించమను. అంతేకానీ, అనవసరంగా నోరు జారితే తాట తీస్తా’’ అని నిర్మాత సి.కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఆయనతో సహా పలువురు నిర్మాతలకు గ్యాంగ్‌స్టర్ నయీమ్‌తో సంబంధాలున్నాయంటూ నట్టికుమార్ చేసిన ఆరోపణలపై శుక్రవారం సి.కల్యాణ్ మాట్లాడారు. ‘‘ఒకప్పుడు ఇదే నట్టికుమార్ మద్దెలచెరువు సూరి, భానుకిరణ్లతో నాకు సంబంధాలున్నాయని కోర్టులో కేసులు వేశాడు. ఓ చీటింగ్ కేసు నుంచి అతణ్ణి బయట పడేయడానికి పోలీసులే నాపై కేసు పెట్టమన్నారని జడ్జ్ ముందు చెప్పాడు. నేను నిర్దోషిగా బయటపడ్డా’’ అని సి.కల్యాణ్ పేర్కొన్నారు. ఇంకా సి.కల్యాణ్ మాట్లాడుతూ - ‘‘తెలంగాణ సిఎం కేసీఆర్, సీబీఐ, సిట్ అధికారులను కలుస్తాం. మా తప్పుంటే శిక్షించమని, లేదంటే నట్టికుమార్ పై చర్యలు తీసుకోమని కోరనున్నాం. న్యాయమే నా ఆయుధం’’ అన్నారు. ఎంతో మంది ఆర్టిస్టులను బ్లాక్మెయిల్ చేసిన ఘనుడు, ఎన్నో చెక్‌బౌన్స్ కేసుల్లో దోషి నట్టికుమార్ అని విమర్శనాస్త్రాలు సంధించారు. నయీమ్‌తో నట్టికుమార్‌కి ఏవైనా సంబంధాలు ఉన్నాయేమో? అవి బయట పడకూడదని ఇతరులపై ఆరోపణలు చేస్తున్నాడేమో అన్నారు. పరిశ్రమ పెద్దగా దాసరిగారు ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించవలసిన అవసరం ఉందన్నారు. -
పొగిడితే కానీ పనిచేయదు!
హీరోయిన్ చార్మికి నిన్న ఆదివారం నాటి పుట్టినరోజు ఎప్పటికీ గుర్తుండిపోవచ్చు. హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, నెల్లూరు నుంచి బెంగు ళూరు, ఢిల్లీ దాకా ఆమె అభిమానులు చాలామంది స్వయంగా వచ్చి, చార్మి ఎదురుగానే ఆమె తమకెందుకో ఇష్టమో కవితలు, పాటలు, మాటల రూపంలో చెప్పి మరీ, పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. చార్మి కథానాయికగా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రం ప్రచార చిత్ర ఆవిష్కరణ, చార్మి పుట్టినరోజు వేడుకలు ఒకేసారి ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగాయి. చార్మిని మెచ్చుకొనే ‘చార్మ్ మి’ పోటీలో విజేతలైన అభిమానుల ప్రశంసలు, దర్శక, నిర్మాతలు, చిత్ర యూనిట్ అభినందనల మధ్య ఉక్కిరిబిక్కిరైన చార్మి ‘‘నా జీవితంలో ఇది బెస్ట్ బర్త్‌డే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘నిర్మాత సి. కల్యాణ్ నాకు ‘జ్యోతిలక్ష్మీ’ సినిమానే కాకుండా, నిన్ననే డైమండ్ ఉంగరం కూడా బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని చెప్పారు. ‘‘చార్మిని రోజూ పొగడాలి. పొగిడితే కానీ పనిచేయదు. డెరైక్షన్ కన్నా పొగడడం కష్టం’’ అని పూరీ జగన్నాథ్ చమత్కరించారు. సినిమా గురించి ఆయన చెబుతూ, ‘‘రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఈ కథ రాసినప్పుడు నేను పుట్టాను. అది వచ్చిన పాతికేళ్ళకు ఈ అమ్మాయి (చార్మి) పుట్టింది. ఇన్నేళ్ళుగా ఈ కథ ఈమె కోసమే ఆగి ఉందేమో’’ అని వ్యాఖ్యానించారు. నటుడు సంపూర్ణేశ్‌బాబు, రచయిత భాస్కరభట్ల, కెమేరామన్ పి.జి. విందా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రస్తుతం నేపథ్య సంగీతం పనులు జరుగుతున్నాయనీ, జూన్‌లో సినిమా రిలీజ్ చేస్తామనీ నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు. అన్నట్లు, ఈ సినిమాలో తానే స్వయంగా బుల్లెట్ నడిపాననీ, అదీ ఒకే టేక్‌లో ఓకె చేశాననీ చార్మి స్పష్టం చేశారు. సినిమాలో ‘హీరోయిజమ్ కాదు... హీరోయినిజమ్ చూస్తారు’ అన్న మాటలకు అర్థం అదేనా! -
సెంచరీ సాధించాలని ఉంది!
‘‘అగ్ర నిర్మాత రామానాయుడిగారి స్ఫూర్తితో నిర్మాతగా వంద సినిమాలు పూర్తి చేసి, సెంచరీ సాధించాలని ఉంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. ఆయన తాజాగా అనువదించిన ‘పిశాచి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సి. కల్యాణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘తమిళనాట ‘పీకే’తో పాటు విడుదలైన ఈ సినిమా అక్కడ విజయ విహారం చేసింది. ప్రముఖ దర్శకుడు బాల ఈ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనే భావన కలగదు’’ అని తెలిపారు. తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సి. కల్యాణ్ వివరిస్తూ -‘‘మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి కాంబినేషన్లో మా సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మితో మేం చేయనున్న ‘జ్యోతిలక్ష్మి’ షూటింగ్ మార్చి మొదటివారంలో మొదలవుతుంది. సినిమా పరిశ్రమలోని అమ్మాయి అంటే చిన్న చూపు చూసేవారికి ఈ సినిమా సరైన సమాధానం చెబుతుంది. ఏప్రిల్‌లో వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తమిళ ‘మయూరి’ని తెలుగులో నేనే విడుదల చేస్తున్నా’’ అన్నారు. -
రాజకీయాల్లో ఉండే వాళ్లు సినీ పరిశ్రమలో ఉండకూడదు