సెంచరీ సాధించాలని ఉంది! | Producer C Kalyan goal is 100 movie Producer | Sakshi
Sakshi News home page

సెంచరీ సాధించాలని ఉంది!

Published Wed, Feb 25 2015 10:50 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

సెంచరీ సాధించాలని ఉంది!

సెంచరీ సాధించాలని ఉంది!

 ‘‘అగ్ర నిర్మాత రామానాయుడిగారి స్ఫూర్తితో నిర్మాతగా వంద సినిమాలు పూర్తి చేసి, సెంచరీ సాధించాలని ఉంది’’ అని నిర్మాత సి. కల్యాణ్ చెప్పారు. ఆయన తాజాగా అనువదించిన ‘పిశాచి’ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సి. కల్యాణ్ పత్రికల వారితో ముచ్చటిస్తూ -‘‘తమిళనాట ‘పీకే’తో పాటు విడుదలైన ఈ సినిమా అక్కడ విజయ విహారం చేసింది. ప్రముఖ దర్శకుడు బాల ఈ సినిమాను ఎంతో ఇష్టపడ్డారు. ఎక్కడా డబ్బింగ్ సినిమా అనే భావన కలగదు’’ అని తెలిపారు.
 
 తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి సి. కల్యాణ్ వివరిస్తూ -‘‘మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్, మంజుభార్గవి కాంబినేషన్‌లో మా సంస్థలో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చార్మితో మేం చేయనున్న ‘జ్యోతిలక్ష్మి’ షూటింగ్ మార్చి మొదటివారంలో మొదలవుతుంది. సినిమా పరిశ్రమలోని అమ్మాయి అంటే చిన్న చూపు చూసేవారికి     ఈ సినిమా సరైన సమాధానం చెబుతుంది. ఏప్రిల్‌లో వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. నయనతార తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన తమిళ ‘మయూరి’ని తెలుగులో నేనే విడుదల చేస్తున్నా’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement