ఆమిర్‌ ఖాన్‌ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’ | Sanjay Dutt Biopic Sanju Crossed Aamir Khan PK Records | Sakshi
Sakshi News home page

ఆమిర్‌ ఖాన్‌ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’

Published Sat, Aug 4 2018 9:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Sanjay Dutt Biopic Sanju Crossed Aamir Khan PK Records - Sakshi

ఆమిర్‌ ఖాన్‌ రికార్డును బద్దలు కొట్టిన ‘‘సంజు’’

ముంబై : బాలీవుడ్‌ స్టార్‌ హీరో సంజయ్‌ దత్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా అగ్రకథానాయకుల రికార్డులను బద్దలు కొడుతూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే సల్మాన్‌ ఖాన్‌ ‘‘టైగర్‌ జిందా హై’’ రికార్డును తుడిచిపెట్టిన ‘సంజు’ మూడవ స్థానంలో ఉన్న ఆమిర్‌ ఖాన్‌ ‘‘పీకే’’ రికార్డును సైతం బద్దలుకొట్టింది. విడుదలైన 5 వారాల్లో 341కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన మూడవ సినిమాగా సంజు నిలిచింది.

అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా మొదటి రెండు స్థానాల్లో బాహుబలి-2(510కోట్లు), దంగల్‌(387కోట్లు) ఉన్నాయి. కొత్తగా విడుదలవుతున్న సినిమాలకు సంజు గట్టిపోటీ ఇస్తోంది. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహించిన సంజు సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ సంజయ్‌ దత్‌ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement