ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలపై నిర్మాత సి. కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నిర్మాతల సంక్షేమం కోసం రకరకాలుగా ఆదాయాన్ని సమకూర్చామని తెలిపారు. తొలిసారిగా నిర్మాతలకు మెడి క్లైమ్ తీసుకొచ్చింది తానేనని అన్నారు. అయితే నిర్మాతల మండలి ఆదాయానికి గిల్డ్ అనే గ్రూపు గండి కొట్టిందని ఆయన ఆరోపించారు. దాసరి బాటలో నిర్మాతగా, నిర్మాతల మండలిలో చిన్న సభ్యుడిగా ఎదిగానని వెల్లడించారు.
(ఇది చదవండి: అందం కోసం సర్జరీ చేయించుకున్న హనీ రోజ్?)
కానీ గత నాలుగేళ్లలో ఫిల్మ్ ఛాంబర్ సర్వనాశనమైందని విమర్శలు చేశారు. నాలుగు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలను కలిపి లీడ్ చేద్దామనుకుంటున్నామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయా ప్రభుత్వాల సహకారంతో నాలుగు రాష్ట్రాల పరిశ్రమలకు మంచి చేస్తామని అన్నారు. ఈ సారి నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి బలమైన కారణం ఉందని కల్యాణ్ అన్నారు.
సి. కల్యాణ్ మాట్లాడుతూ..' గతంలో దిల్ రాజు, దామోదరప్రసాద్ వచ్చి డిజిటల్ ఛార్జీల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెబితే విరమించుకున్నా. రెండు లక్షల రూపాయలు లేకుండా సినిమా విడుదల ఆగిపోయిన సందర్భాలు నేను ఎదుర్కొన్నా. చిన్న సినిమాలు ఆపితే కృష్టానగర్ అకలితో అలమటిస్తుంది. పెద్ద సినిమాలకు ఎక్కువ మంది పనిచేయరు. చిన్న సినిమాలను బతికించాలి. ఐదుగురు నిర్మాతలు చిన్న సినిమాలకు మేం ఉన్నామని చెబితే సంతోషించాం. సినీ పరిశ్రమకు దాసరి లాంటి వ్యక్తులు కావాలి. ఎన్నికల్లో ఆ నిర్మాతలు పోటీ చేయరు, ప్రతిపాదిస్తారు, బెదిరిస్తారు. నేను నాలుగు సినీ పరిశ్రమలను కలపగలను. డైలాగులు చెప్పడం కాదు ఆచరణ సాధ్యమయ్యే పనులు చేయండి. ' అంటూ విమర్శలు గుప్పించారు.
ఫిల్మ్ ఛాంబర్ గురించి మాట్లాడుతూ..' ఆస్కార్ నిర్మాత దానయ్య, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను ఎందుకు నిలబెట్టడం లేదు. ఫిల్మ్ ఛాంబర్‌కు సేవ చేసేవాళ్లే కావాలి. పని చేసే వాళ్లను నిర్మాతలు గుర్తిస్తారు. ఓటు హక్కు ఉన్నవాళ్లలో 1600 మంది నిర్మాతలున్నారు. ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాణ సంస్థలకు ఓటు హక్కు ఉంది, వ్యక్తులకు కాదు. బ్యానర్ తరపున ప్రతినిధి తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎన్నికల్లో పోటీపై దిల్ రాజును కలిసి మాట్లాడాను. గిల్డ్‌లోని 27 మంది సభ్యులు 1600 మంది నిర్మాతల రక్తం తాగుతున్నారు. దిల్ రాజు పక్కనున్నవాళ్లకు పోస్టులు కావాలి.' అని అన్నారు.
(ఇది చదవండి: 63 ఏళ్ల వయసులో స్టార్ హీరో రిస్క్‌లు!)
Comments
Please login to add a commentAdd a comment