తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత! | Producer And Distributor Dheeraj Mogilineni Opens Office In Tirupati | Sakshi
Sakshi News home page

Dheeraj Mogilineni: తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత ధీరజ్!

Mar 20 2024 8:59 PM | Updated on Mar 21 2024 10:11 AM

Producer and Distributor Dheeraj Mogilineni Opens Office in Tirupati  - Sakshi

ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్‌గా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు.

ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement