Telugu Film Chamber of Commerce
-
జానీ మాస్టర్‌పై కేసు.. విచారణకు రెడీ అయిన ఫిలిం ఛాంబర్
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.విచారణ చేపడతాందానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయిన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితురాలి ఫోటోలను, వీడియోలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దని కోరారు.అసలేమైంది?మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి 2017లో జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. 2019లో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం అతడితోపాటు ముంబై వెళ్లగా ఆ సమయంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ తనను వేధించేవాడని తెలిపింది. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడని, అతడి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.చదవండి: లైంగిక వేధింపుల కేసు.. ఎఫ్ఐఆర్లో కీలక అంశాలు -
గద్దర్ అవార్డ్స్.. స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్!
త్వరలోనే గద్దర్ అవార్డ్స్ పై విధి విధానాలను రూపొందించి సీఎం రేవంత్ గారికి అందచేస్తామని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలిపింది.గద్దర్ అవార్డ్స్ పేరిట ప్రతి సంవత్సరం అవార్డ్స్ ప్రకటించడం పట్ల ఫిలిం ఇండస్ట్రీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారితో అవార్డ్స్‌కు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయడంపై చర్చించడం జరిగిందని తెలిపారు. గద్దర్ అవార్డుల కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను (ఎఫ్డీసీ) కోరినట్లు పేర్కొన్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్తంగా ఒక కమిటీని నియమిస్తామని వెల్లడించారు. త్వరలోనే విధివిధానాలు రూపొందించి సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని లేఖ విడుదల చేశారు.కాగా.. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ సీఎం రేవంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గద్దర్ అవార్డ్స్ ప్రకటిస్తే.. ఇప్పటివరకు టాలీవుడ్ నుంచి స్పందన రాలేదని ముఖ్యమంత్రి మాట్లాడారు. దీంతో ఈ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. TFPC & TFCC thanking Telangana Chief Minister @revanth_anumula for Prestigious Gaddar Awards #GaddarAwards pic.twitter.com/y3LJg8IKlE— Telugu Film Producers Council (@tfpcin) July 31, 2024 -
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా అశోక్ కుమార్ గెలిచారు. ఆదివారం ఉదయం జరిగిన ఫిలిం ఛాంబర్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో మొత్తం 48 మంది సభ్యులు పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టగా అధ్యక్ష బరిలో ఉన్న భరత్ భూషణ్‌కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్ష బరిలో ఉన్న అశోక్ కుమార్‌కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు వచ్చాయి.కాగా గతేడాది నిర్మాతల విభాగం నుంచి దిల్ రాజు టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా గెలుపొందారు. ఆయన పదవీకాలం ముగియడంతో నేడు మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి ఠాగూర్ మధు (నెల్లూరు), భరత్ భూషణ్ (విశాఖపట్టణం) బరిలో నిలిచారు. ఉపాధ్యక్ష పదవికి మాత్రం నిర్మాతలైన అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీపడ్డారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, స్టూడియోల యజమానులు వంటి నాలుగు సెక్టార్స్‌లోని సభ్యులు ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.చదవండి: నేను, మహేశ్‌బాబు హీరోయిన్ను ఏడిపించాం: సుధ -
సీఎం రేవంత్ కామెంట్స్‌పై స్పందించిన టీఎప్సీసీ
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచనలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాం అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలతో మాట్లాడని ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌ని కలిసి మాట్లాడతామని ప్రకటనలో పేర్కొన్నారు.కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. అలా అయితే టికెట్ ధరలు పెంచుతామని కండీషన్ పెట్టారు. -
నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!
దుబాయిలో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(TFCC) కీలక ప్రకటన చేసింది. అది రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతం అని, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. నంది పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ అవార్డుల పేటెంట్ పూర్తిగా ఏపీ పేరు మీదే ఉందని, దుబాయిలో వేడుకలపై సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ డిమాండ్ చేసింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) అలానే నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఎలాంటి పురస్కారాలు ఇవ్వకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ పేరుతోనే ఉంది, అందుకే తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు మాత్రమే ఆ హక్కు ఉందని క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రైవేటు సంస్థగా, వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వేడుకలకు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని టీఎఫ్‌సీసీ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
హోరాహోరీగా సాగిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు.. ఓటేసింది వీళ్లే (ఫోటోలు)
-
TFCC Election: చిన్న నిర్మాతలను ఆదుకోవాలి..ఆర్. నారాయణమూర్తి
ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల్లో ఏ ప్యానల్ గెలిచినా 80శాతం నిర్మాతలకు ఉన్న కష్టాలను తీర్చాలి. సినిమాలు నిర్మించి చాలా మంది లాస్ అవుతున్నారు. క్యూబ్ వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి. ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. వాటిని తగ్గించాలి. పండగ సెలవుల్లో భారీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో చిన్న సినిమాలకు అవకాశాలు రావడం లేదు. సగటు సినిమాలకు కూడా అవకాశం కల్పించాలి. థియేటర్స్‌కి మార్నింగ్ షో సమస్యలు తీర్చాలి. ప్రస్తుతం కొద్ది మంది చేతుల్లోనే ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంది. చిన్న నిర్మాతలను ఆదుకోండి’ అని నారాయణ మూర్తి అన్నారు. టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మరికాసేపట్లో ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు. కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. -
TFCC Election 2023: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు
►తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు ►వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు ►కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్ ►ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్ ►మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు ►తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ►ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్. ►డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్.. ►తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడి గా దిల్ రాజు ఎన్నిక దాదాపు ఖాయం. ►తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు. ►ఫైనల్ రిజల్ట్ ►అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు.. ►మొత్తం ఓట్లు - 48 ►మెజారిటీ మార్క్ - 25 ►ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5.. ►డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) దిల్ రాజుకి 6, సి కళ్యాణ్ కి 6. ►స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ (4) దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1. ►ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16) దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8. ►కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4) ► తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్ భారీ విజయం ► నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు ► దిల్‌రాజు, దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్, పద్మిని, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్ నుంచి గెలిచారు. ► డిస్ట్రిబ్యూషన్ విభాగంలో ఇరు ప్యానెల్ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు. ► స్టూడియో సెక్టార్లో నలుగురికి గాను దిల్‌రాజ్ ప్యానెల్ నుంచి ముగ్గురు గెలుపొందారు. ► తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో దిల్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉంది. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి.కల్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి. ► మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు అయిన తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్ 3:30 నిమిషాలకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 891,స్టూడియో సెక్టార్ నుంచి 68,డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి రికార్టు స్థాయిలో పోలింగ్ జరిగింది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై.. 6 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు(మధ్యాహ్నం 3 గంటలు) 1233 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 810 , స్టూడియో సెక్టార్ నుంచి 68, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 355 ఓట్లు నమోదయ్యాయయి. ► ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్ చాంబర్లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ► మధ్యాహ్నం 1.30 గంటల వరకు 1035 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 650, స్టూడియో సెక్టార్ నుంచి 65, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 320 ఓట్లు నమోదయ్యాయి. ►సినీ ప్రముఖులు సురేశ్ బాబు, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, జీవిత తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ►టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటంన్నింటిని పరిష్కరించే సామర్థ్యం ఎవరికి ఉందో ఆలోచించి ఓటు వేయాలని నటి, దర్శకురాలు జీవిత విజ్ఞప్తి చేశారు. కోవిడ్ టైమ్‌లో ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్ చూసిందని, అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను దిల్ రాజు వర్గానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం 710 ఓట్లు పోలైయ్యాయి. వాటిలో ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 450, స్టూడియో సెక్టార్ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 210 ఓట్లు నమోదయ్యాయి. ► చాంబర్ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది’ అన్నారు. ► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఉదయం 10.45 వరకు దాదాపు 232 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ లో 95 ఓట్లు, స్టూడియో సెక్టార్ లో 35 ఓట్లు, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 102 ఓట్లు పోలైయ్యాయి. ► టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్‌కు తరలి వస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన దిల్ రాజు, సి. కల్యాణ్ ఫిల్మ్ చాంబర్‌కు చేరుకొని పోలింగ్ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. విజేతలను సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు. సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ►ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. ► టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 1600 మంది సభ్యులు ఉన్నారు. ► ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు. -
రేపే ఫిలిం ఛాంబర్ ఎన్నికలు, దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్
తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్(చలనచిత్ర వాణిజ్య మండలి) ఎన్నికలకు వేళైంది. దిల్ రాజు ప్యానెల్, సి కల్యాణ్ ప్యానెల్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పటికే హోరాహోరీగా సాగిన ప్రచారానికి తెర పడగా ఆదివారం ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ నిర్వహించి సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడిస్తారు. ఫిలిం ఛాంబర్ కామర్స్‌లో నిర్మాతల సెక్టార్, డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్, ఎగ్జిబిటర్స్ సెక్టార్, స్టూడియో సెక్టార్ అనే నాలుగు విభాగాలున్నాయి. ఫిలిం ఛాంబర్లో మొత్తం 1600 మంది సభ్యులుండగా రేపు 900 మంది సభ్యులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న నిర్మాత దిల్ రాజు తాజాగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న సభ్యులతో దిల్ రాజు ప్యానెల్ ఉంది. దిల్ రాజు ప్యానెల్ అంటేనే యాక్టివ్ ప్యానెల్. రేపు జరిగే ఎన్నికల్లో 4 విభాగాల సభ్యులు పాల్గొననున్నారు. ఈ నాలుగు విభాగాల్లో సమస్యలున్నాయి. మరీ ముఖ్యంగా ఎగ్జిబిటర్స్‌కు, నిర్మాతలకు సమస్యలు ఎక్కువ. వాటన్నింటిని పరిష్కరించేందుకు ఎన్నో కొత్త ఐడియాలతో మా ప్యానెల్ ముందుకు వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీని అందరం ఐక్యతతో ఇంకా ముందుకు తీసుకెళ్తాము. ఒక వ్యక్తికి పది బ్యానర్లు ఉన్నా మనిషికి ఒక ఓటు ఉండాలి. ఇక్కడ సభ్యులు మొత్తం 1500 మంది పైన ఉన్నారు, కానీ యాక్టివ్‌గా ఉండేది 150 మంది మాత్రమే! మూడు సంవత్సరాలలో సినిమా తీసినవాళ్లు మాత్రమే ఈసీలో కూర్చోవాలని చెప్పాం, కానీ దానికి వాళ్లు ఒప్పుకోలేదు. ఇక్కడ సక్సెస్ లేకపోతే వెనకబడిపోతాం. అందుకనే మేము ప్రొడ్యూసర్ గిల్డ్ పెట్టాం. మాకున్న సమస్య.. ఛాంబర్ బైలాలో మార్పులు జరగాలి. బైలాను మార్చుకుంటే భవిష్యత్తు తరాలకు ఇబ్బందులు లేకుండా ఉంటుంది. నేను పోటీ చేయడం మా ఇంట్లో ఇష్టం లేదు, కానీ ఈ సభ్యుల కోసం నేను ఎలక్షన్స్‌లో నిలబడ్డాను. మా ప్యానెల్‌ను గెలిపిస్తే ఛాంబర్‌ను మరింత ధృడంగా మారుస్తాం. క్యూబ్ యూఎఫ్‌వో రేట్లు దేశంలో అన్ని చోట్ల ఒకటేగా ఉంది. ఇదిమన ఒక్క సమస్య కాదు అందరికీ ఇదే సమస్య. సౌత్, నార్త్ వాళ్ళందరిని కలుపుకొని క్యూబ్ ufo సమస్యని అధిగమించాలి. మాకు రెండు సంవత్సరాలు అవకాశం ఇస్తే మేము ఏమి చేస్తామో చూపిస్తాము' అని దిల్ రాజు పేర్కొన్నాడు. చదవండి: పెళ్లైన ఆరేళ్లకే విడాకులు.. బాధ నుంచి బయటపడలేకపోతున్నా అంటూ ప్రేమకు, పెళ్లికో దండం అంటూ జబర్దస్త్ రీతూ పోస్ట్.. ప్రియుడితో బ్రేకప్! -
సూపర్ స్టార్ కృష్ణ మృతి: రేపు షూటింగ్స్ బంద్!
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ తెలుగు చిత్రపరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. సినిమాలకు సంబంధించి అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది. కాగా ఘట్టమనేని కృష్ణ 1943లో మే 31 జన్మించారు. గుంటూరు జిల్లా తెనాలిలోని బుర్రిపాలెం ఆయన స్వస్థలం. 1965వ సంవత్సరంలో “తేనె మనసులు” చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించారు కృష్ణ. అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. దాదాపు 350 సినిమాలలో హీరోగా నటించారు. ఈస్ట్‌మన్‌కలర్, 70MM, DTS సౌండ్, సినిమా స్కోప్లను తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన మొదటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పద్మాలయా స్టూడియోస్, పద్మాలయా ప్రొడక్షన్ హౌస్‌లను స్థాపించి అన్ని భారతీయ భాషలలో అనేక చిత్రాలను నిర్మించారు. 2003లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు, 2009లో “పద్మభూషణ్”, 1974లో ఉత్తమ నటుడిగా “అల్లూరి సీతారామరాజు” సినిమాకు నంది అవార్డు అందుకున్నారు. అలాగే 1997లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ - సౌత్‌తో పాటు 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 1989లో ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: కృష్ణ నటించిన ఆఖరి చిత్రం ఏంటో తెలుసా? -
టాలీవుడ్ హబ్‌ను ఏర్పాటు చేయాలి: విజయేంద్ర ప్రసాద్
‘‘తెలుగులో ‘టాలీవుడ్ హబ్’ ఏర్పాటు చేయాలి. దీని కోసం దక్షిణ భారత చిత్రనిర్మాతలు, దర్శకులు తదితరులను ఆహ్వానించాలి. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలుగు ఫిలిం ఛాంబర్, ఇతర సినిమా అసోసియేషన్స్ సహకారంతో హైదరాబాద్‌లో సభ నిర్వహించాలి. ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీగారిని ఆహ్వానించాలి’’ అన్నారు రచయిత, దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్. గురువారం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యాలతయానికి వెళ్లిన విజయేంద్ర ప్రసాద్‌ను నిర్మాతల మండలి తరఫున ప్రసన్న కుమార్, మోహన్ వడ్లపట్ల సత్కరించారు. -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
8 వారాల తర్వాత... షూటింగ్స్ రీస్టార్ట్ పై దిల్‌రాజు క్లారిటీ
-
8 వారాల తర్వాతే ఓటీటీలో సినిమా: దిల్ రాజు
సినీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నిర్మాతలు షూటింగ్‌లు బంద్ చేసిన విషయం తెలిసిందే! ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి చర్చిస్తున్నారు. తాజాగా ఫిలిం ఛాంబర్ సభ్యులు తాము తీసుకున్న కొత్త నిర్ణయాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. 'ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆపేసి మరీ కమిటీలు వేసుకున్నాం. నిర్మాతలుగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 8 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. టికెట్ రేట్లు కూడా తగ్గించాలని భావిస్తున్నాం. థియేటర్లు, మల్టీప్లెక్సులతో మాట్లాడాం.. సినీప్రియులకు టికెట్ రేట్లు తగ్గించి ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఇక సినిమాలో ఎందుకు వృథా ఖర్చు అవుతుందనేది చర్చించాం.. ఇంకా షూటింగ్స్ ఎప్పుడు ప్రారంభం కావాలనేది నిర్ణయం తీసుకోలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫైనల్ మీటింగ్స్ ఉన్నాయి, ఆ తర్వాతే అన్నీ వివరంగా చెప్తాం' అని చెప్పుకొచ్చాడు. ఈ సమావేశానికి సి. కల్యాణ్, మైత్రి రవి, దామోదర ప్రసాద్, బాపినీడు డైరెక్టర్ తేజ తదితరులు హాజరయ్యారు. చదవండి: బ్రెయిన్ పని చేయని స్థితిలో కమెడియన్ ఆత్మహత్యకు ముందు నా కూతురిని ఆ నటుడు వేధించాడు: నటి తల్లి -
టాలీవుడ్లో షూటింగులు తిరిగి ప్రారంభం?
టాలీవుడ్లో త్వరలోనే షూటింగులు పునఃప్రారంభం కానున్నాయి. నేడు (గురువారం)ఫిల్మ్ ఛాంబర్ కీలక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం నిలిచిపోయిన షూటింగులు తిరిగి ప్రారంభించడంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా మూడు సినిమాలు హిట్ కావడం, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతుండటంతో మళ్లీ షూటింగులు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈనెల 22 నుంచే షూటింగులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా సినిమాలకు అవుతున్న అధిక బడ్జెట్,ఓటీటీ విడుదల సహా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యల కారణంగా ఆగస్ట్1 నుంచి షూటింగ్స్‌ను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వాయిదా వేసిన సంగితి తెలిసిందే. -
షూటింగులు బంద్.. కొనసాగుతున్న చర్చలు
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్), వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ), మల్టీప్లెక్స్ ప్రతినిధులు, సినీ కార్మిక సంఫల నాయకులతో చర్చలు జరిపింది. తాజాగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని సినివ డిస్ట్రిబ్యటర్స్తో సమావేశం జరిగింది. థియేటర్ రెవెన్యూ షేరింగ్, సినిమా టికెట్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో నిర్మాతలు ‘దిల్’ రాజు, దామోదర ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్స్ భరత్ చౌదరి, సత్యనారాయణ, వీరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల మూడో వారంలో డిస్ట్రిబ్యటర్స్తో మరోసారి ఫిల్మ్ ఛాంబర్లో సవవేశం జరగనుందట. -
కొడుకుతో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కొడుకు పుట్టాక ఆయన భార్య తేజస్వినితో కలిసి తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా డిసెంబర్ 10, 2020న అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో దిల్‌రాజు, తేజస్వినిల వివాహం జరిగిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గానే దిల్‌రాజు మరోసారి తండ్రి అయ్యారు. దీంతో కొడుకుతో సహా శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.కాగా ఈ సందర్భంగా సినిమా షూటింగ్స్ నిలిపివేయడంపై సుమన్ మాట్లాడిన తీరుపై రిపోర్టర్స్ స్పందించగా సినిమాకు సంబంధించిన విషయాలు అక్కడ ప్రస్తావించనన్నారు. దేవుడి సన్నిధిలో వాటి గురించి చర్చించనంటూ పేర్కొన్నారు. కాగా ఆగస్ట్ 1 నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని ప్రొడ్యుసర్స్ గిల్డ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో షూటింగ్‌లు నిలిచిపోయాయి. -
షూటింగ్ బంద్‌ను ఒక మహాయజ్ఞంలా ప్రారంభించాం: సి. కల్యాణ్
C Kalyan Dil Raju Comments After Telugu Film Chamber Of Commerce Meeting: సినిమా షూటింగ్‌లు బంద్ అయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గురవారం (ఆగస్టు 4) భేటీ అయింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. అనంతరం తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ.. ‘‘సినిమా షూటింగ్‌ల బంద్ విషయంలో నిర్మాతల మధ్య భేదాభిప్రాయాలు లేవు. సమస్యల పరిష్కారం కోసమే చిత్రీకరణలు ఆపాం. సమస్యల పరిష్కారం కోసం షూటింగ్‌ల బంద్‌ని ఒక మహాయజ్ఞంలాగా ప్రారంభించాం. అయితే బయట అందరూ ఏవేవో చెబుతుంటారు.. వాటిని నిర్మాతలు పట్టించుకోవద్దు. అందరం కలిసికట్టుగా ఉందాం. సమస్యలు పరిష్కరించుకుందాం. ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ, కౌన్సిల్ జనరల్ సెక్రటరీల ఆధ్వర్యంలో పనులు డివైడ్ చేసుకొని ముందుకు వెళుతున్నాం. త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయి’’ అని తెలిపారు. ‘‘ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి, చర్చిస్తున్నాం. వాటిలో సినిమాలు రిలీజ్ అయిన ఎన్ని వారాలకు ఓటీటీకి వెళితే ఇండస్ట్రీకి మంచిది అని చర్చించేందుకు ఓ కమిటీ వేసుకున్నాం. థియేటర్స్‌లో వీపీఎఫ్ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై మరో కమిటీ వేశాం. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండిషన్స్‌పై కూడా ఓ కమిటీ వేశాం. ప్రొడక్షన్లో వృథా ఖర్చు తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్ ఎన్ని గంటలు చేయాలనేదానిపై చర్చించేందుకూ మరో కమిటీ వేశాం. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశం లేదు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం’’ అని నిర్మాత దిల్ రాజు పేర్కొన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ''కొవిడ్ పాండమిక్ తరువాత సినిమా పరిశ్రమ వర్కింగ్ కండిషన్లో చాలా మార్పులు వచ్చాయి. దానివల్ల ప్రొడ్యూసర్స్ కు ఎక్కువ నష్టం వచ్చింది. కాబట్టి తెలుగు ఫిలిం ఛాంబర్ తరుపున నిర్మాతలకు పూర్తి మద్దతు ఇస్తున్నాం. కానీ మీడియాలో మాత్రం చాలా వేరే విధంగా రాస్తున్నారు. కాబట్టి ఛాంబర్ తరుపున ఏదైతే బులెటిన్ ఇస్తామో అదే రాయండి'' అని తెలిపారు. మండలి కార్యదర్శి శ్రీ. టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ''ఇవాళ ప్రేక్షకులు థియేటర్‌కు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇలాంటి తరుణంలో పరిశ్రమను ఓక తాటిపై ఇండస్ట్రీ ను కాపాడుకోవాలనే ఉద్దేశ్యం తో ఓటీటీకి సినిమా ఎప్పుడు ఇవ్వాలి? సామాన్యుడు థియేటర్ కు రప్పించడానికి టికెట్ రేట్స్ ను రీదనేబుల్గా తగ్గించలానే విషయాలపై కృషి చేస్తున్నాం. ఆ తరువాత వర్కర్స్ వేజేస్ విషయమై ఫెడరేషన్ తోను, కాస్ట్ ప్రొడక్షన్ విషయమై దర్శకులు మీటింగుల్లోనూ, ఆర్టిస్టుల సహకారం కొరకు మా అసోసియేషన్ తోను, సంప్రదింపులు చేస్తున్నాం. గతంలో ఎన్టీరామారావు గారు, అక్కినేని నాగేశ్వర్ రావు గారు లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లోనే రూ. 10 వేలు తీసుకొని తెలుగు చలన చిత్ర పరిశ్రమను కాపాడారు. రెండోది డిజిటల్ ఛార్జీలు నిర్మాతలకు చాలా భారంగా ఉంది. ఈ సమస్య నుంచి బయటపడాలి. పర్సంటేజ్ సిస్టమ్‌లో చిన్న సినిమాకు, ఒక పర్సంటేజ్ అని, పెద్ద సినిమాకు ఒక పర్సంటేజ్ అని ఎక్జిబిటర్స్ అడుగుతున్నారు. ఈ సమ్యసలన్నీ చర్చించడం కోసం సినిమాల షూటింగ్‌లు వాయిదా వేయడం జరిగింది. దీన్ని మీరు స్ట్రైక్ అనొద్దు. బంద్ అనొద్దు. ఇండస్ట్రీకు పూర్వ వైభోవం తీసుకొని రావడానికి మేము అందరం పని చేస్తున్నాము. దయచేసి మీడియా వారికీ ఒక చిన్న విన్నపం గిల్డ్ మీటింగ్ అని రాయకండి, కేవలం తెలుగు ఫిలిం ఛాంబర్ మాత్రమే పేరెంట్ బాడీ, కాబట్టి మీటింగులు అన్ని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. కాబట్టి ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కలిసికట్టుగా పని చేస్తూ.. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడము, నష్టపరచడము మా ఉద్దేశ్యము కాదు. కరోనా లాంటి కష్ట కాలంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ని ఆదరించిన ప్రతి ప్రేక్షకుడికి శతధా ధన్యవాదాలు. వాళ్ల ఆదరణ మూలంగా ప్రపంచంలోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ గొప్పగా ఉందని చెప్పుకొంటున్నాం. అలాంటి ప్రేక్షకులకు పాదాభివందనం చేస్తున్నాము. అలాంటి ప్రేక్షకులకు టికెట్ రేట్స్ భారంగా ఉండకూడదని టికెట్ రేట్స్ తగ్గిస్తున్నాము. ఈ సమావేశం తెలుగు ఫిలిం ఛాంబర్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, మా అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్ లతోను సంప్రదింపులు జరుగుతాయి'' అని తెలిపారు. -
త్వరలోనే ఆ రిజల్ట్ వస్తుంది: దిల్ రాజు
సాక్షి, హైదరాబాద్: సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీకి వెళ్తే బాగుంటుంది? థియేటర్స్‌లో వీపీఎఫ్ చార్జీలు ఎంత ఉండాలి? ఇలా పలు అంశాలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ గురువారం భేటీ అయింది. ఈ సందర్భంగా అనేక అంశాలను వారు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 'నిర్మాతలమందరం కలిసి షూటింగ్స్ ఆపాం. మేము ప్రస్తుతం నాలుగు అంశాలపై చర్చిస్తున్నాం. సినిమాలు ఓటీటీకి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అన్న విషయంలో ఓ కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించినదానిపై పని చేస్తోంది. రెండోది.. థియేటర్స్‌లో వీపీఎఫ్ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై కమిటీ వేశాం. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడుతుంది. మూడోది.. ఫెడరేషన్ వేజెస్, వర్కింగ్ కండీషన్స్‌పై కూడా కమిటీ వేశాము. నాలుగు.. నిర్మాతలకు ప్రొడక్షన్లో వేస్టేజ్ తగ్గింపు, వర్కింగ్ కండీషన్స్, షూటింగ్ నంబర్ ఆఫ్ అవర్స్ జరగాలంటే ఏం చెయ్యాలన్నదానిపై కూడా కమిటీ వేశాం. ఫిలిం చాంబర్ ఆధ్వర్యంలో ఈ నాలుగు అంశాల మీద నాలుగు కమిటీలు వేశాం. ప్రస్తుతం అవి పని చేస్తున్నాయి. కానీ కొందరు సోషల్ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్ ఆపాలన్న ఉద్దేశ్యం లేదు. నిర్మాతకు ఏదీ భారం కాకూడదు. గత మూడు రోజుల నుంచి మూడు, నాలుగు మీటింగ్స్ అయ్యాయి. నాలుగు కమిటీలు చాలా హోంవర్క్ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా ఉండాలనేది వర్క్ చేస్తున్నాం, త్వరలో ఆ రిజల్ట్ వస్తుంది' అని దిల్ రాజు పేర్కొన్నాడు. చదవండి: బరువు తగ్గిన ప్రభాస్.. ట్రిమ్డ్ గడ్డంతో స్టైలీష్‌గా ‘డార్లింగ్’.. పిక్స్ వైరల్ ఓటీటీలోకి సాయి పల్లవి ‘గార్గి’, ఎప్పుడు?.. ఎక్కడ? -
Tollywood: వచ్చే నెల నుంచి కొత్త వీపీఎఫ్ చార్జీలు అమలు!
ఇండస్ట్రీలో నెలకొన్న వివిధ సమస్యల కారణంగా ఈ నెల 1నుంచి తెలుగు సినిమాల చిత్రీకరణలను నిలిపి వేస్తున్నట్లుగా యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిర్మాతలు చెబుతున్న సమస్యల్లో వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) చార్జీలు కూడా ఒక ప్రధానాంశం. ఈ సమస్య పరిష్కారం దిశగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫిలిం ఎగ్జిబిటర్స్ హైదరాబాద్‌లోని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘‘డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, వారికి చెల్లించనున్న వీపీఎఫ్‌పై సుదీర్ఘంగా చర్చించుకున్నాం. చర్చలు ఆశాజనకంగా జరిగాయి. కొత్త వీపీఎఫ్ చార్జీలు వచ్చే నెల 1 నుంచి అమలయ్యే విధంగా కృషి చేస్తాం’’ అని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కానూరి దామోదర్ ప్రసాద్, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ది తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి అనుపమ్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. -
షూటింగ్స్ బంద్‌పై సుమన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఫిలిం చాంబర్ సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యుసర్స్ గిల్డ్ కూడ అంగీకారం చెప్పడంతో నేటి నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా షూటింగ్‌ల బంద్‌పై సీనియర్ నటుడు సమమన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీకి ఏమౌతుందని, ఏం కాదంటూ వ్యాఖ్యానించారు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ ‘ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవలానడం సబబు కాదు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డిమాండ్ అండ్ సప్లై’ అన్నారు. అనంతరం షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సూచించారు. ‘షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి. రెండు రోజుల చేసే వర్క్‌ని ఒక రోజులో చేయండి. అవసరం మేరకే కాల్షీట్ తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కాల్షీట్ తీసుకోవాలి. వర్క్ ఫాస్ట్‌గా చేయాలి. అంతేకాని రేట్స్ తగ్గించకోండి. రెమ్యునరేషన్ తగ్గించుకోండనడం కరెక్ట్ కాదు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై వారు మాకు క్లోజ్ అని, మా ఫ్యామిలీ అంటూ కొందరు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్లు వెళ్లి మాట్లాడండి. దీంట్లో రిలేషన్ షిప్ అనేది ఏం ఉండదు. డబ్బు ఇస్తున్నారు కదా తొందరగా రావాలని గట్టిగా చెప్పండి. మేనేజర్లు అక్కడ పెట్టడం కాదు. ఇవన్ని స్వయంగా నిర్మాతే చూసుకోవాలి. మా టైంలో అవుట్ డోర్ షూటింగ్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసే వాళ్లం. అదే ఇప్పడు 9 గంటలకు వస్తున్నారు. 6 గంటలకే ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇలా అయితే ఖర్చు పెరగదా. ఒకప్పుడ. లేట్ అయితే అడగాలి. వర్క్ షాప్ చేయాలి. ఒకప్పుడ భయ్యర్ సినిమా కోనేవాడు. సినిమ ఫ్లాప్ అయితే అతడిని ఎవరు పట్టించుకోరు. రెట్స్ తగ్గించుకోమ్మంటున్నారు. మరి భయ్యర్ పరిస్థితేంటి?’ అని ఆయన ప్రశ్నించారు. -
ఫిలిం చాంబర్ నూతన అధ్యక్షుడు ఎవరో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్‌కు బసిరెడ్డి నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 22 ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై విజయం సాధించారు. బసిరెడ్డిని నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ ఎన్నికలో మొత్తం 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చదవండి: హీరోగానే కాదు షూటర్‌గా అదరగొట్టిన అజిత్.. -
సోమవారం నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్
తెలుగు ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న సినిమాల చిత్రీకరణలు కూడా నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ఆగస్ట్ 1న షూటింగ్స్ బంద్ చేయాలని టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించేందుకే ఆదివారం ఫిలిం చాంబర్ జనరల్ బాడీ సమావేశమైంది. ఈ సమావేశంలో గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఫిలిం చాంబర్ మద్దతు ఇచ్చింది. 24 క్రాఫ్ట్స్ లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయని, వాటిని పరిష్కరించేవరకు షూటింగ్స్ నిలివేస్తున్నామని తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి వెల్లడించారు. రన్నింగ్‌లో ఉన్న సినిమాల షూటింగ్స్ కూడా నిలివివేస్తున్నామని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు. సమస్యల పరిష్కారం దొరికేంత వరకు ఈ నిర్ణయం ఉంటుందని చెప్పారు. -
సినీకార్మికుల సమ్మె సక్సెస్, వేతనాల పెంపుకు సమ్మతమే!
సాక్షి, హైదరాబాద్: సినీ కార్మికుల వేతనాల పెంపు చర్చలు సఫలమయ్యాయి. వేతనాల పెంపుకు దిల్ రాజు నేతృత్వంలో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ నిర్వహించాము. రేపటి నుంచి యథావిధిగా షూటింగ్స్ జరుగుతాయి. కో ఆర్డినేషన్ కమిటీ డిసైడ్ చేసిన తర్వాత ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ ద్వారా పెరిగిన వేతనాలు అమల్లోకి వస్తాయి. దిల్ రాజు చైర్మన్‌గా శుక్రవారం ఉదయం 11 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం అవుతుంది' అని చెప్పారు. వేతనాల పెంపుపై ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హర్షం వ్యక్తం చేశారు. 'వేతనాలు పెంచడం మాకు సంతోషం. విధివిధానాలు కోసం కమిటీ వేశారు రేపటినుండి విధుల్లో పాల్గొంటాము. మా డిమాండ్లు అన్ని అంగీకరించారు. కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా మా సమస్యలు పరిష్కరించుకుంటాము. రేపటి నుంచి షూటింగ్స్‌లో పాల్గొంటాము అని తెలిపారు. చదవండి: పది మంది పిల్లలు, నటికి మీడియా మొఘల్ విడాకులు! యంగ్ హీరో సినిమాపై తలైవా పొగడ్తల వర్షం -
సినీ కార్మికుల సమ్మె, నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల భేటీ
వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీనిపైత తాజాగా నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు ఫిలిం చాంబర్ భేటీ అయ్యారు. ఇప్పటికే ఇరువర్గాలు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. దీంతో సమస్య పరిష్కారం దిశగా మాట్లాడుకోని నిర్ణయం తీసుకోవాల్సిందిగా మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. చదవండి: సినీ కార్మికుల సమ్మెపై సీనియర్ నటుడు నరేశ్ స్పందన ఈ క్రమంలో చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు తాజాగా ఫిలిం చాంబర్లో భేటీ అయ్యి సినిమా కార్మికుల సమ్మె, సినిమా షూటింగ్స్, వేతనాల పెంపు వంటి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కాగా ఈ సమావేశానికి సి కల్యాణ్, ఎన్వీ ప్రసాద్, ప్రసన్న కుమార్, కిరణ్, సుప్రియ, కొల్లి రామకృష్ణ, సుధాకర్ రెడ్డి, ఠాగూర్ మధు తదితరలు హజరయ్యారు. చదవండి: సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు -
సినీకార్మికుల సమ్మె.. మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. బుధవారం ఫిలించాంబర్ ఎదుట ఆందోళన చేపట్టిన సినీ కార్మికులు షూటింగ్‌లను సైతం బహిష్కరించారు. దీంతో హైదరాబాద్‌లో పరిసరాల్లో 20కిపైగా షూటింగ్‌లు జరుపుకుంటున్న తెలుగు, తమిళ, హిందీ చిత్రాల షూటింగ్‌లు నిలిచిపోయాయి. దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బుధవారం మాట్లాడుతూ.. సినీ కార్మికులలో అత్యధికంగా నిరుపేదలే ఉన్నారని, కరోనా సమయంలో షూటింగ్స్ లేక అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సినీ కార్మికుల డిమాండ్స్ కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే కరోనా కారణంగా చిత్రపరిశ్రమ తీవ్ర ఇబ్బందులలో ఉన్నందున రెమ్యునరేషన్ పెంచే విషయమై ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులు గడువు కోరారని, కానీ ఆ గడువు ముగియడంతో వేతనాలు పెంచాలంటూ కార్మికులు సమ్మెకు దిగారని తెలిపారు. కార్మికులు చేపట్టిన ఆందోళన ఉదృతం కాకముందే సామరస్యపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి 2,3 రోజులల్లో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అసోసియేషన్ ప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ప్రభుత్వం జోక్యం చేసుకునేవరకు వేచి చూడొద్దని హితవు పలికారు. మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ మాట్లాడుతూ.. 'సినీ కార్మికుల నిర్ణయం వల్ల నేడు చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. ఈ నెల 6వ తేదీన మాకు ఫెడరేషన్ నుంచి లేఖ వచ్చింది. కానీ దానికంటే ముందే వేతనాలపై ఫిలిం ఛాంబర్ ఆలోచిస్తోంది. ఇంతలోనే ఫిలిం ఫెడరేషన్ ఇలా సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం చాలా తప్పు. షూటింగ్‌లు ఆపేదే లేదు. రేపటి నుంచి యథావిధిగా కార్మికులు షూటింగ్స్‌కు హాజరుకావాలి. వేతనాలపై విధి విధానాలు రూపకల్పన చేస్తాం. మీకు ఐదు కండీషన్స్ పెడుతున్నాం. 1. నిర్మాతలపై ఒత్తిడి చేసే ఆలోచన ఉంటే విరమించుకోవాలి. 2. సినీ కార్మికుల ఒత్తిడికి తలొగ్గి ఎవరూ వేతనాలు పెంచొద్దు. 3. అందరం కలిసి షూటింగ్స్ జరుపుకుందాం. 4. ఎల్లుండి వేతనాలపై చర్చిస్తాం. 5. ఏ కార్మికుడి కడుపు కొట్టాలని నిర్మాత చూడడు. కార్మికులందరికి వేతనాలు పెంచడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. ఒకవేళ సినిమా కార్మికులు హాజరుకాకపోతే తామే షూటింగ్ లు ఆపేస్తాం. 2018లో వేతనాలపై ఒప్పందం చేసుకున్నాం. ఫిలిం ఫెడరేషన్ నాయకులు కార్మికుల కడుపు కొట్టొద్దు' అని పేర్కొన్నాడు. చదవండి: తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ వద్ద టెన్షన్.. టెన్షన్ -
పక్కా మాస్‌గా 'ఏజెంట్ నరసింహ 117'.. ట్రైలర్ రిలీజ్
Agent Narasimha 117 Movie Trailer Released: కీర్తి కృష్ణ హీరోగా నిఖిత, మధుబాల హీరోయిన్లుగా లక్ష్మణ్ చప్రాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏజెంట్ నరసింహ 117’. నవ్యసాయి ఫిలిమ్స్ పతాకంపై బి. నరసింహా రెడ్డి నిర్మించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, దర్శకుడు వి. సముద్ర, తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాస్, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌లు ‘ఏజెంట్ నరసింహ 117’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘పక్కా మాస్‌గా రూపొందిన మూవీ ఇది. ఈ నెలలోనే రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు నిర్మాత బి. నరసింహా రెడ్డి. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ చప్రాల, నటుడు దయ మాట్లాడారు. రాజ్ కిరణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. చదవండి: ఆయన పాటలు అనేక భావోద్వేగాలను పలకించేవి: ప్రధాని మోదీ నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్ రావిపూడి -
వ్యూస్ కోసం అలాంటి థంబ్‌నైల్స్ పెట్టడం కరెక్ట్ కాదు
‘‘డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో తంబ్‌నైల్స్, పైరసీ సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆరోపణలు వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. అంతేకానీ కొందరు లైక్‌లు, వ్యూయర్స్ కోసం నిర్మాతలు, నటులు, దర్శకులపై తంబ్‌నైల్స్ పెట్టి ఇబ్బంది పెట్టడం తగదు. యూట్యూబ్ తంబ్‌నైల్స్, పైరసీ చేసేవారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో చర్చిస్తాం.. పైరసీ సెల్‌ను యాక్టివ్ చేస్తాం’’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినీ ఇండస్ట్రీవారిపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలు, పైరసీ వంటి విషయాలపై చర్చించేందుకు 24క్రాఫ్ట్స్ అధక్షులు, సెక్రటరీలు నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో గురువారం సమావేశమయ్యారు. నిర్మాత ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ– ‘‘ఓటీటీలపైనా సెన్సార్ ఉండాలి. ఓటీటీలో సినిమా వచ్చిన రోజు సాయంత్రానికల్లా సినిమా పైరసీ అవుతోంది. ఫిలిం చాంబర్ యాంటీ పైరసీ విభాగం డబ్బున్న వాళ్లకే పని చేస్తోంది.. పైరసీని అరికట్టడంలో ఫిలిం చాంబర్ పాత్ర శూన్యం’’ అన్నారు. ‘‘యూట్యూబ్‌కి కూడా సెన్సార్ విధానం తీసుకురావాలి’’ అని డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ అన్నారు. ‘‘మా కుటుంబంపై వచ్చే అసత్య వార్తల వల్ల 25ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాను. మా కష్టాలను అర్థం చేసుకోండి’’ అని నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్ అన్నారు. ‘‘సోషల్ మీడియాలో ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు.. వారికి ఇష్టమైంది రాసుకుంటున్నారు.. దీన్ని అరికట్టాలి’’ అన్నారు దర్శకుడు ఎన్. శంకర్. -
టీఎఫ్‌సీసీ అధ్యక్షుడిగా కొల్లి రామకృష్ణ.. అప్పటివరకు పదవిలో..
Kolli Ramakrishna Elected To Telugu Film Chamber President: తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షునిగా కొల్లి రామకృష్ణ ఎన్నికయ్యారు. టీఎఫ్‌సీసీ అధ్యక్షునిగా ఉన్న నారాయణ్ దాస్ నారంగ్ అనారోగ్యంతో ఈ నెల 19న మృతి చెందిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం జరిగిన ‘టీఎఫ్‌సీసీ’ కార్యవర్గ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్)ను తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఈ ఏడాది జూలై 31వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 1946 జులై 27న జన్మించిన నారాయణ దాస్ నారంగ్ (76) ఏప్రిల్ 19, 2022న మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఏషియన్ మల్టీప్లెక్స్ , ఏషియన్ థియేటర్స్ అధినేతగా ఉన్న ఆయన.. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. చదవండి: ఏషియన్ థియేటర్స్ అధినేత కన్నుమూత చదవండి: బర్త్‌డే గర్ల్ సమంత వద్ద ఉన్న ఈ కాస్ట్లీ వస్తువులు తెలుసా ? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'టాలీవుడ్‌కు ఇవే పెద్ద దిక్కు, ప్రభుత్వాలు వీటితోనే చర్చ జరపాలి'
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలున్నాయి. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్, ‘మా’(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కలిసి సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ముందుకు వెళతాం’’ అని ఫిల్మ్ చాంబర్ జనరల్ సెక్రటరీ, నిర్మాత దామోదర ప్రసాద్ అన్నారు. కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించేందుకు ‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో నిర్మాత జి.ఆది శేషగిరిరావు అధ్యక్షతన సినీ ప్రముఖులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ– ‘‘చాంబర్ తరఫున సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాల కోసం ముందుకువెళతాం. మూడు నెలల తర్వాత మరోసారి సమావేశమై చర్చిస్తాం’’ అన్నారు. ‘‘టాలీవుడ్‌కి ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలి పెద్ద దిక్కు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సినిమాలకు సంబంధించి ఏ చర్చ అయినా వీటితోనే జరపాలి’’ అని నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్ అన్నారు. సినిమా పరిశ్రమకు మేలు జరిగేందుకు ప్రభుత్వాలతో ఎవరు చర్చించినా అభ్యంతరం లేదు. కానీ, కలిసే ముందు ఫిల్మ్ చాంబర్, నిర్మాతల మండలిని సంప్రదించాలనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమయింది. కాగా ఈ సమావేశానికి 250మందిని ఆహ్వానించినా కేవలం 60–70 మంది మాత్రమే వచ్చారు. స్టార్ హీరోలెవరూ ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం. దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, తమ్మారెడ్డి భరద్వాజ, సి.కల్యాణ్, నవీన్ ఎర్నేని, చదలవాడ శ్రీనివాసరావు, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, ఎన్.వి.ప్రసాద్, అశోక్ కుమార్, వై. రవి, అనిల్ సుంకర, నటులు మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు ఫిలిం ఛాంబర్ ధన్యవాదాలు
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది ఫిలిం ఛాంబర్. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్.. సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ... 'మా సినిమా ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రలో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది. మా సమస్యలను ప్రభుత్వాలకే చెప్పుకుంటాం. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాటిని పరిష్కరించండి. టిక్కెట్ రెట్లు, కరెంట్ బిల్లులు మొదలగు సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాము' అని తెలిపారు. ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... 'వంద శాతం ఆక్యుపెన్సి జీవో ఇచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. షూటింగ్‌లకు పర్మిషన్, కరెంట్ బిల్లులు ఆన్లైన్ టిక్కెట్ రేట్లతో పాటు మిగిలిన సమస్యలను పరిష్కరించండి' అని కోరారు. -
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మాకు సంబంధంలేదు
-
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో మాకు సంబంధంలేదు
సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఖండించింది. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదని పేర్కొంటూ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. 'తెలుగు సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు ఎంతో అవసరం. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పరిశ్రమపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం, వేదన ఉంటుంది. వాళ్ల అభిప్రాయాలను వివిధ వేదికలపై వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా చెప్పే అభిప్రాయాలతో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సంబంధం లేదు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు) కరోనా మహామ్మారి సహా వివిధ అంశాలపై తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్నినానితో చర్చించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2020 మార్చి నుంచి సినీ పరిశ్రమనే నమ్ముకున్న వేలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయి. సినీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు. ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు ఇరు రాష్ట్రాల సీఎంల మద్దతు ఇలాగే కొనసాగాలి' అని కోరారు. చదవండి: (పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసు: పేర్ని నాని) -
రామ్ సినిమా ఆపాలంటూ తమిళ నిర్మాత ఫిర్యాదు
హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగులో సినిమా అనౌన్స్ చేయగానే లైకా ప్రొడక్షన్స్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. చిక్కుల్లో రామ్ చిత్రం లింగుస్వామికి, తనకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ లో లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అది పూర్తి చేయకుండా, మా ప్రాజెక్ట్ పక్కనపెట్టి తెలుగులో రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది కరెక్టు కాదు, మాట ప్రకారం ముందు మా బ్యానర్లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. అందుకే నేను ఫిర్యాదు చేశాను గానీ ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదని’ వివరించారు. మరి దీని పై లింగుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖి’ స్పెషల్ షో -
ఆ తర్వాతే కొత్త సినిమాలు.. ఫిలించాంబర్ కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సినిమా చిత్రీకరణలు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు షూటింగ్స్ ఆరంభమవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు పాటిస్తే బాగుంటుందనే విషయంపై చర్చించేందుకు ‘తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఓ సమావేశం నిర్వహించాయి. ఆ సమావేశంలో తీర్మానించిన అంశాలను ‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్’(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు నారాయణ్ దాస్ కె. నారంగ్, గౌరవ కార్యదర్శులు కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఎం.రమేష్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. ఆ నిబంధనలు ఈ విధంగా.... ►కోవిడ్‌కి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్న మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి. గతంలో షూటింగ్ చేస్తూ ఆగిపోయిన చిత్రాలకే నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు ప్రాముఖ్యత ఇచ్చి పూర్తి చేయాలి. ఆ తర్వాతే కొత్త సినిమాలు చేయాలి. దర్శకులు కూడా షెడ్యూల్స్‌ని కుదించుకుని తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలి. ►సినిమా నిర్మించే ప్రొడక్షన్ హౌస్ ఆయా నటీనటులు, సాంకేతిక నిపుణుల నుండి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలి. షూటింగ్స్‌కు హాజరైన ప్రతి యూనియన్ సభ్యుడు మొదటి డోస్ వ్యాక్సినేషన్ కచ్చితంగా తీసుకొని ఉండాలి. ఫెడరేషన్‌లోని 24 విభాగాల సభ్యులందరికీ జీవిత భీమా చేయించాలి. ఆ బాధ్యతను ఫెడరేషన్, ఆయా యూనియన్ వారు తీసుకోవాలి. ►పై తీర్మానాలకు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ వారు తమ సమ్మతిని తెలియజేశారు. ఈ విషయాలపై ఏవైనా సలహాలు, ఫిర్యాదులు ఉన్నా, నిబంధనలు పాటించకున్నా తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకుంటాం. -
ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు
గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఛార్జీల చెల్లింపును రద్దు చేయడంతో పాటు ఆ తర్వాతి నెలల బిల్లును వాయిదా పద్ధతిలో చెల్లించే వెసులుబాటును థియేటర్ల యాజమాన్యాలకు కల్పిస్తూ మంగళవారం ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కల్యాణ్ మాట్లాడుతూ – ‘‘ఏపీలో షూటింగ్స్ కోసం పర్మిషన్ కావాలని చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నేను, దామోదర్ ప్రసాద్... ఇలా చాలామంది వెళ్ళి గత జూన్ లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాం. ఆయన కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి తరహాలోనే ఏ నిర్ణయం అయినా వెంటనే చెప్పేస్తారు. మేం తొమ్మిది నెలల కరెంట్ ఛార్జీలు రద్దు అడిగాం. అయితే ప్రభుత్వం మూడు నెలలు రద్దు చేస్తూ, జీవో ఇచ్చింది. మిగతా నెలల బిల్లును కూడా రద్దు చేయాలని కోరుకుంటున్నాం. మళ్ళీ కరోనా కష్టాలు మొదలయ్యాయి. వైజాగ్‌లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలన్నది వైఎస్ గారి డ్రీమ్. దానికి సంబందించిన అన్ని విషయాలూ పరిశీలిస్తున్నాం’’ అన్నారు. ఇంకా ఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర ప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి. వీరనారాయణ్ బాబు, తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు మాట్లాడుతూ – ‘‘ఏ, బీ సెంటర్స్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.10 లక్షలు, సి సెంటర్ థియేటర్స్ వారు తీసుకున్న రూ.5 లక్షల రుణాలపై వడ్డీ 50 శాతం మాఫీ చేయడం మంచి నిర్ణయం. ఆర్బీఐ ఇచ్చిన మారటోరియం 6 నెలల గడువు తర్వాత ఒక ఏడాది వరకు వడ్డీ ఉపసంహరణ వర్తిస్తుంది. థియేటర్స్ వారికి వెసులుబాటు కల్పించడంతో పాటు వేలాది సినీ కార్మికులకు తగిన జీవనోపాధి కలిగించేలా చేసిన జగన్ గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో మాకు సహకరించిన హీరోలు చిరంజీవి, నాగార్జునలకు, మంత్రి పేర్ని నాని, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ చందర్, విజయ్ కుమార్ రెడ్డిలకు కృతజ్ఞతలు’’ అన్నారు. -
ఇండస్ట్రీ నష్టాన్ని ఎలా అధిగమించాలి?
‘తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని ఎలా అధిగమించాలి? ఎవరెవరు ఏయే త్యాగాలు చేయాలి? అనే అంశంపై అన్ని శాఖలవారూ చర్చిస్తున్నాం. ఈ చర్చలకు అందరూ పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ఈ సమావేశాల వివరాలను త్వరలో తెలుపుతాం’’ అన్నారు. -
31 వరకు షూటింగ్స్ బంద్
కరోనా కారణంగా సినిమాల షూటింగ్స్ని నిలిపివేస్తున్నట్లు ఈ నెల 15న తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ప్రకటించిన విషయం తెలిసిందే. 24 శాఖలు తమ విధులను ఈ నెల 21 వరకు తక్షణం ఆపేయాల్సిందిగా మండలి కోరింది. ఇప్పుడు 24 శాఖల వారితో సంప్రదించి మరో కీలక నిర్ణయాన్ని శుక్రవారం విడుదల చేశారు. 21 వరకు పెట్టిన రద్దును మార్చి 31 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉత్తుర్వుల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చలన చిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు పేర్కొన్నారు. -
చిన్న సినిమాలకు పెద్ద వరం
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తీసుకున్న నిర్ణయం చిన్న సినిమాలకు పెద్ద వరం. 116 జీవో చిన్న సినిమాలతో పాటు నిర్మాతలందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంది’’ అని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు వి.వీరినాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘4 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మించే ప్రదేశాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడంతో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) ద్వారా షూటింగ్‌లకు సింగిల్ విండో ద్వారా అనుమతి ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ప్రతి ఏడాది ఎఫ్డీసీ పర్యవేక్షణలో 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి రూ.10 లక్షలు సబ్సిడీ ఇవ్వడం చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఆమోదించడానికి కారకులైన ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం జీఎస్టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం కీలకమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమపట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటోంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ సెక్రటరీ ముత్యాల రాందాసు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌సీసీ సెక్టార్ చైర్మన్ వల్లూరిపల్లి రమేశ్, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ మోహన్ వడ్లపట్ల, ఈసీ మెంబర్ ప్రసన్న కుమార్, స్టూడియో సెక్టార్ తరఫున బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా పూర్వి పిక్చర్స్ అధినేత వి. వీరినాయుడు ఏక గ్రీవంగా ఎన్నికైయ్యారు. ఉపాధ్యక్షునిగా వి. సాగర్ని ఎంపిక చేశారు. వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా అవకాశం వచ్చినందుకు ఆనందంతోపాటు గర్వంగానూ ఉంది. ప్రతి ఏడాది ఒక్కో సెక్టార్ నుంచి ఈ ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది పంపిణీదారుల నుంచి నాకు అవకాశం రావడం జరిగింది. ఇదివరకు నేను ఎగ్జిక్యూటివ్ కమిటీలో మెంబర్‌గా ఉండటం వల్ల అన్ని సెక్టార్ల సమస్యలపై నాకు అవగాహన ఉంది. ఎగ్జిబిటర్లకు జీఎస్టీతో సహా పలు రకాల సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం మా టీమ్‌తో కృషి చేస్తాను. డిజిటల్ ప్రొవైడర్ల సమస్యలపై కూడా దృష్టి పెడతాం. ఇండస్ట్రీకి మేలు చేసే మంచి పనులు చేయడానికి కృషి చేస్తాను’’ అన్నారు. ‘‘కొత్త అధ్యక్షుడు వీరినాయుడు ఎన్నో మంచి పనులు చేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమకు బెస్ట్ అవుతుందని చెప్పగలను’’ అన్నారు ఉప కార్యదర్శి మోహన్ వడ్లపట్ల. నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ వల్లూరిపల్లి రమేష్ మాట్లాడుతూ– ‘‘డిస్ట్రిబ్యూటర్ కమ్ ఎగ్జిబిటర్‌గా వీరినాయుడుకి ఎంతో అనుభవం ఉంది. సబ్సిడీ విషయంలో నిర్మాతల సమస్యలను పరిష్కరించాలి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల సమస్యలను త్వరగా పరిష్కరించాలి. పాతవారితో కుదరక పోతే కొత్త డీఎస్పీలను ఎంపిక చేయాలి’’ అన్నారు. పాత కమిటీలోని కె. బసిరెడ్డి, ముత్తవరపు శ్రీనివాస బాబు ప్రస్తుత కమిటీలో ఉపాధ్యక్షులుగా కొనసాగ నున్నారు. నిర్మాతల సెక్టార్ కౌన్సిల్ చైర్మెన్‌గా వల్లూరిపల్లి రమేష్, స్టూడియోస్ సెక్టార్ కౌన్సిల్ చైర్మెన్‌గా వై. సుప్రియ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ కౌన్సిల్ చైర్మెన్‌గా వి. నాగేశ్వరరావు, ఎగ్జిబిటర్ కౌన్సిల్ చైర్మెన్‌గా జీ. వీరనారాయణ బాబు కొనసాగుతారని జనరల్ బాడీ ప్రతినిధులు పేర్కొన్నారు. కొత్త కార్యవర్గానికి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, నిర్మాత సురేష్ కొండేటి అభినందించారు. -
చిన్నా పెద్దా తేడా లేదు.. క్యాష్తో సమన్యాయం
‘‘తెలుగు చిత్రపరిశ్రమలో ఇటీవల లైంగిక వేధింపుల విషయమై పలు విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి సీరియస్‌గా తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో విశాఖ గైడ్‌లైన్స్ పేరుతో ఇచ్చిన సూచనల ఆధారంగా లైంగిక వేధింపుల నిరోధానికి ‘క్యాష్’ (కమిటీ అగైనెస్ట్ సెక్సువల్ హెరాస్మెంట్) కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో టి.ఎఫ్.సి.సి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టి.ఎఫ్.సి.సి అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ– ‘‘క్యాష్’ కమిటీలో చిత్రపరిశ్రమ నుంచి నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ఫెడరేషన్ సభ్యులతో పాటు సమాజంలోని స్వచ్ఛంద సంస్థల వారు, లాయర్లు, డాక్టర్లు, ప్రభుత్వాధికారులు ఉంటారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల వారు తమకు ఏవైనా వేధింపులు ఎదురైతే ఈ కమిటీ దృష్టికి తీసుకురావచ్చు’’ అన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడంతో మన కుటుంబంలోని వ్యక్తి ఇలా చేసిందే అని భావోద్వేగానికి గురై ఆ రోజు అలా మాట్లాడాను. అంతేకానీ ఆమెపై వ్యక్తిగతంగా మాకు ఎటువంటి విరోధం లేదు. ‘మా’ సభ్యులెవరూ ఆమెతో కలిసి నటించకూడదని ఆ రోజు అన్నాం. అయితే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, డైరెక్టర్స్ అసోసియేషన్, ‘మా’ అసోసియేషన్ పెద్దలు శ్రీరెడ్డి విషయాన్ని పునః పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఆమెకు ‘మా’లో సభ్యత్వం విషయాన్ని జనరల్ బాడీలో పరిశీలించే వరకూ ‘మా’ సభ్యులందరూ శ్రీరెడ్డితో కలిసి నటించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. నటించొచ్చు. ఈ సందర్భంగా ఆమెకు మేం వెల్కమ్ చెబుతున్నాం. శ్రీరెడ్డికి ఏ సహాయం కావాలన్నా చేస్తాం. తెలుగు నటీనటులకు అవకాశాలు ఇమ్మని ‘మా’ ఎప్పుడూ కోరుతుంది. కానీ, అవకాశాలు ఇచ్చే నిర్ణయం ఆయా దర్శక–నిర్మాతలదే’’ అన్నారు. ‘‘క్యాష్’ కమిటీలో పదిమంది ఇండస్ట్రీవారు, మరో పదిమంది సమాజంలోని ప్రముఖులు ఉంటారు.అతి త్వరలోనే కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపుల కేసులన్నీ ఆ కమిటీకి వెళతాయి. ఇక్కడ పెద్దా చిన్నా అనే తేడా ఉండదు. అందరికీ సమన్యాయం జరుగుతుంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. ఈ కార్యక్రమంలో రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు, నిర్మాత కె.ఎల్. నారాయణ, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, ‘మా’ జనరల్ సెక్రటరీ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
కొందరి ప్రయోజనాల కోసం బంద్ ఆపేస్తారా? – ఆర్. నారాయణమూర్తి
‘‘చిత్ర పరిశ్రమలో బ్రహ్మాస్త్రం లాంటి బంద్‌ను ఉపయోగించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్లు ఏం సాధించారో అర్థం కావడం లేదు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు’’ అని మండిపడ్డారు ఆర్. నారాయణమూర్తి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌కు, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చార్జీల విషయంలో చర్చలు విఫలమై ఈ నెల 2 నుంచి థియేటర్స్ బంద్ అయ్యాయి. చర్చలు తాత్కాలికంగా సఫలమై శుక్రవారం నుంచి థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. బంద్ ముగిసింది. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత–నటుడు ఆర్. నారాయణమూర్తి్ మాట్లాడుతూ– ‘‘తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీలో ఇంకా బంద్ కొనసాగుతూనే ఉంది. ఐదేళ్ల తర్వాత ఫ్రీగా ఇస్తామంటూ డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చిన హమీలు అమలు కాకముందే హఠాత్తుగా బంద్ ఎందుకు విరమించుకున్నారు? ఈ బంద్ వల్ల సినీ కార్మికులు ఇబ్బందిపడ్డారు తప్ప ఒరిగింది ఏమీ లేదు. డిజిటల్ సర్వీస్ చార్జీలు తగ్గితే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో సంఘీభావం తెలిపాం. కానీ కొందరి ప్రయోజనాలు, స్వార్థం కోసం బంద్‌ను ఆపేస్తారా? దీనికోసమైతే సురేశ్‌బాబు, జెమిని కిరణ్, అల్లు అరవింద్ లాంటి పెద్దలు బంద్ వరకు వెళ్లకుండా ముందే మాట్లాడి సెటిల్ చేస్తే సరిపోయేది కదా? గతంలో రామానాయుడుగారు, దాసరి నారాయణరావుగారు లాంటి పెద్దలు పదిమంది నిర్మాతల మంచి కోరేవారు. ఐక్యత లేకపోవడం వల్ల గతంలో మేం చేసిన పోరాటాలు, నిరహార దీక్షల వల్ల సక్సెస్ సాధించలేకపోయాం. ఇప్పుడూ సక్సెస్ కాలేకపోయాం. ఇందుకు కారణం మేజర్ సెక్టార్ సపోర్ట్ లేకపోవడమే. తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులు కలగజేసుకుని చిన్న చిత్రాల నిర్మాతలకు న్యాయం చేయాలి. తక్కువ చార్జీలకే కొత్త కంపెనీలు వస్తు న్నా కొందరు రానివ్వడం లేదు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ జోక్యం చేసుకుని మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఉచితంగా ఇచ్చేంతవరకు బంద్ ఆపబోమని చెప్పి, రెండు వేల రూపాయలు తగ్గించగానే థియేటర్స్ బంద్ ఆపేశారు. ఇది కాదు మేం కోరుకున్నది’’ అన్నారు తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్. -
ప్రొడ్యూసర్స్ సెక్టార్ అధ్యక్షుడిగా రమేశ్
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్మాతల విభాగానికి (ప్రొడ్యూసర్స్ సెక్టార్) అధ్యక్షునిగా అశోక్, ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, కబడ్డీ కబడ్డీ, గోపి గోపిక గోదావరి తదితర చిత్రాలు నిర్మించిన వల్లూరిపల్లి రమేశ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా పద్మిని–బాబ్జీ, కార్యదర్శులుగా బోడపాటి మురళి–రాజేశ్వరి ఎన్నికయ్యారు. -
ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సెక్టార్ కార్యవర్గాన్ని అవిశ్వాసంతో తొలగించి, కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటి దాకా నిర్మాతల సెక్టార్‌కు చైర్మన్ అయిన ప్రతాని రామకృష్ణగౌడ్ పైన, ఆఫీస్ బేరర్లపైన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో పాత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ కోసం హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు. బసిరెడ్డి, విజయేందర్‌రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. తాజా ఎన్నికలతో నిర్మాత పి. సత్యారెడ్డి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శంకర్ గౌడ్, వల్లూరిపల్లి రమేశ్, సెక్రటరీలుగా పద్మిని, పూసల కిషోర్ ఎన్నికయ్యారు. -
తలసానిని కలసిన ఫిలిం చాంబర్ సభ్యులు
సినీ, టీవీ వాహనాల ఓనర్ల అసోసియేషన్‌తో ఇబ్బందులపై ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌తో కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కోరారు. ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌బాబు, సభ్యులు దిల్‌రాజు, కె.ఎల్. దామోదర ప్రసాద్, శివరామకృష్ణ, రవికిశోర్, ప్రసాద్ తదితరులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి సమస్యలను వివరించారు. తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్‌కు తమ ఫెడరేషన్లో గుర్తింపు లేదని, షూటింగ్‌లకు వచ్చే వాహనాలను అడ్డుకుంటూ అంతరాయం కలిగిస్తున్నారని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ లొకేషన్లను ధ్వంసం చేశారని, వారి ఆగడాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ విషయంపై తెలుగు సినిమా, టీవీ వాహనాల ఓనర్స్ అసోసియేషన్ సభ్యులతో మంగళవారం చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి తలసాని హామీ ఇచ్చారు. -
పక్కా ప్రొఫెషనల్ !
యువతకు నచ్చే అంశాలకు వినోదం, సందేశం జోడించి తెరకెక్కించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్... పక్కా ప్రొఫెషనల్’. స్వీయ దర్శకత్వంలో రఫీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలవుతోంది. రఫీ మాట్లాడుతూ - ‘‘అన్ని రకాల ప్రేక్షకులనూ ఆకట్టుకునే అంశాలతో పాటు యువతకు నచ్చే రొమాన్స్ ఈ చిత్రంలో ఉంది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు మా విన్నపాన్ని మన్నించి సమయానికి చిత్రం రిలీజ్ అయ్యేందుకు థియేటర్ల ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు. సునీల్ నారంగ్ నేతృత్వంలో కమిటీ కూడా వేశారు. ఇందుకు ఛాంబర్ అధ్యక్షుడు సురేశ్ బాబు సహా కార్యవర్గమంతటికీ కృతజ్ఞతలు’’ అన్నారు.