సాక్షి, హైదరాబాద్: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఖండించింది. వ్యక్తిగత అభిప్రాయాలతో మాకు సంబంధం లేదని పేర్కొంటూ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. 'తెలుగు సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాల మద్దతు ఎంతో అవసరం. ప్రభుత్వాల మద్దతు లేకుండా సినీ పరిశ్రమ మనుగడ సాధ్యం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ పరిశ్రమ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పరిశ్రమపై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం, వేదన ఉంటుంది. వాళ్ల అభిప్రాయాలను వివిధ వేదికలపై వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా చెప్పే అభిప్రాయాలతో తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సంబంధం లేదు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన మోహన్‌బాబు)
కరోనా మహామ్మారి సహా వివిధ అంశాలపై తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది. తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి పేర్నినానితో చర్చించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సినీ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 2020 మార్చి నుంచి సినీ పరిశ్రమనే నమ్ముకున్న వేలాది కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాయి. సినీ పరిశ్రమకు తెలుగు రాష్ట్రాలు రెండు కళ్లు. ఇద్దరు ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమను కాపాడేందుకు ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు. సినీ పరిశ్రమకు ఇరు రాష్ట్రాల సీఎంల మద్దతు ఇలాగే కొనసాగాలి' అని కోరారు. చదవండి: (పవన్ కల్యాణ్ పెద్ద సుత్తి కేసు: పేర్ని నాని)
Comments
Please login to add a commentAdd a comment