
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రత్యేక కమిటీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రొడ్యూసర్ కౌన్సిల్, ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్), వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీ), మల్టీప్లెక్స్ ప్రతినిధులు, సినీ కార్మిక సంఫల నాయకులతో చర్చలు జరిపింది. తాజాగా ఆదివారం తెలుగు రాష్ట్రాల్లోని సినివ డిస్ట్రిబ్యటర్స్‌తో సమావేశం జరిగింది.
థియేటర్ రెవెన్యూ షేరింగ్, సినిమా టికెట్ ధరలు, వీపీఎఫ్ చార్జీలపై ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో నిర్మాతలు ‘దిల్’ రాజు, దామోదర ప్రసాద్, డిస్ట్రిబ్యూటర్స్ భరత్ చౌదరి, సత్యనారాయణ, వీరినాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నెల మూడో వారంలో డిస్ట్రిబ్యటర్స్‌తో మరోసారి ఫిల్మ్ ఛాంబర్‌లో సవవేశం జరగనుందట.
Comments
Please login to add a commentAdd a comment