దుబాయిలో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(TFCC) కీలక ప్రకటన చేసింది. అది రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతం అని, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. నంది పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ అవార్డుల పేటెంట్ పూర్తిగా ఏపీ పేరు మీదే ఉందని, దుబాయిలో వేడుకలపై సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ డిమాండ్ చేసింది.
(ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!)
అలానే నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఎలాంటి పురస్కారాలు ఇవ్వకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ పేరుతోనే ఉంది, అందుకే తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు మాత్రమే ఆ హక్కు ఉందని క్లారిటీ ఇచ్చింది.
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రైవేటు సంస్థగా, వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇస్తున్నారు, దీన్ని తీవ‍్రంగా ఖండిస్తున్నామని, ఈ వేడుకలకు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని టీఎఫ్‌సీసీ చెప్పుకొచ్చింది.
(ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!)
Comments
Please login to add a commentAdd a comment