తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.
గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్‌మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డి
కాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment