Thammareddy Bhardwaj
-
త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఆరోపణలు.. తమ్మారెడ్డి ఏమన్నారంటే?
స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆరోపణలు ఇప్పటివీ కాదు. తాజాగా మరోసారి ట్విటర్ వేదికగా గురూజీపై పూనమ్ విమర్శలు చేసింది. ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్‌ని గట్టిగా ప్రశ్నించాలని ఆమె ట్విటర్ వేదికగా కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో.. ప్రస్తుతం ఈ ట్వీట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.అయితే పూనమ్ కౌర్ ట్వీట్‌పై టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దానిపై ప్రశ్న అడగ్గా.. ఆయన మాట్లాడారు. ఆమె 'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కు ఫిర్యాదు ఎప్పుడు చేసిందో మాకు తెలియదు.. ఒకవేళ అప్పటికే కమిటీ ఏర్పడి ఉంటే.. ఫిర్యాదు బాక్స్‌లో తన కంప్లైంట్ వేసి ఉంటే సరిపోయేది.. ఎందుకంటే ఆ ఫిర్యాదును 'మా' వాళ్లు పంపించినా దానిపై మేము చర్చించేవాళ్లం. ఇప్పటికైనా మా వరకు ఫిర్యాదు వస్తే కచ్చితంగా స్పందిస్తామని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన పూనమ్ కౌర్ హీరోయిన్గా తెలుగులో పలు సినిమాలు చేసింది. త్రివిక్రమ్‌పై పూనమ్ ట్వీట్త్రివిక్రమ్ గురించి హీరోయిన్ పూనమ్ కౌర్ ఇవాళ ట్వీట్ చేసింది. 'త్రివిక్రమ్‌పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేశా. కానీ సినీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సినీ పెద్దలు ఈ విషయమై త్రివిక్రమ్‌ని ప్రశ్నించాలి.' అని పూనమ్ కౌర్ అని ట్విటర్(ఎక్స్)లో రాసుకొచ్చింది.Had maa association taken complaint on trivikram Srinivas , I and many wouldn’t have had the political suffering , I was rather silently ignored , I had given a call tand then complaint to the heads , I want industry big wigs to question Director Trivikram .— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 17, 2024 -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
సహకార పద్ధతిలో సినిమా విడుదల!
‘‘సహకార పద్ధతిలో ఓ చిత్రాన్ని విడుదల చేయడం మంచిదే. దీనివల్ల ఒక్కో జిల్లాల్లో పది, పదిహేను మంది ఫండింగ్ చేసుకుని సినిమాను విడుదల చేస్తారు. ఈ విధానంలో చిత్రాన్ని విడుదల చేస్తున్న రఫీని అభినందిస్తున్నాను’’ అని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు. రఫీ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్’. రఫీ మాట్లాడుతూ - ‘‘ప్రస్తుతం సినిమా విడుదల కష్టమవుతోంది. అందుకే, ఫేస్బుక్ ద్వారా సహకార విధానాన్ని ప్రకటించగానే, వివిధ జిల్లాల నుంచి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ముందుకొచ్చారు. అలాగే, ట్రైలర్ చూసి, కొంతమంది పంపిణీదారులు ముందుకొచ్చారు’’ అన్నారు. -
నిజమైన నాయకుడు!
హీరోగా విలక్షణమైన పాత్రలు చేసి, జీవితంలో కూడా పదిమందికి సహాయం చేసి, హీరో అనిపించుకున్నారు స్వర్గీయ శ్రీహరి. అందుకే ఆయన్ను ‘రియల్‌స్టార్’ అంటారు. అదే టైటిల్‌తో శ్రీహరి హీరోగా రూపొందిన ఆ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేయగా, హంసానందిని కథానాయికగా నటించారు. సి.రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు నిర్మించారు. శ్రీహరి అభినయం హైలైట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథి: ఉగ్గిరాల సీతారామయ్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై. గిరిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్. -
మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ
నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర వ్యాఖ్యాత్రి సుమ తనయుడు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అనంతమ్’. పార్ధసారథి, వందిత నటిస్తున్న ఈ చిత్రానికి రమణలోక్‌వర్మ దర్శకుడు. వి.శ్రవణ్‌కుమార్, పవన్‌కుమార్ నిర్మాతలు. సాకేత్‌సాయిరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. పడిన కష్టానికి తగు ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందని రాజీవ్ కనకాల ఆశాభావం వెలిబుచ్చారు. సుమ మాట్లాడుతూ -‘‘చిన్నప్పట్నుంచీ మా అబ్బాయికి నటనపై మక్కువ. రాజీవ్ ప్రోత్సహిస్తున్నా, చదువు దెబ్బతింటుందని నేనే ఆపాను. ఏడాది క్రితం రమణలోక్‌వర్మ చెప్పిన కథ మాకు బాగా నచ్చి ఇద్దరం పచ్చజెండా ఊపేశాం. ఈ సినిమాకు పనిచేసిన అందరితో పాటు, మా అబ్బాయిక్కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు సునీల్‌కుమార్‌రెడ్డి, దేవీ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామరాజు తదితరులు మాట్లాడారు. -
తెలుగు జాతి గర్వపడాలి!
‘‘రామానాయుడు లాంటి నిర్మాతలు ఇప్పుడు లేరు. భారతదేశంలో అన్ని భాషల్లో సినిమాలు తీసిన ఆయన మన పరిశ్రమలో ఉన్నందుకు తెలుగు జాతి గర్వపడాలి’’ అని దాసరి వ్యాఖ్యానించారు. రామానాయుడు గురించి సీనియర్ సినీ పాత్రికేయుడు వినాయకరావు రచించిన ‘మూవీమొఘల్’ పుస్తకాన్ని హైదరాబాద్‌లో దాసరి ఆవిష్కరించి, తొలి ప్రతిని కృష్ణకు అందించారు. సినిమా పరిశ్రమకు రామానాయుడు మరువలేని సేవలందించారని కృష్ణ పేర్కొన్నారు. తనపై మంచి పుస్తకాన్ని రూపొందించినందుకు రామానాయుడు ఆనందం వెలిబుచ్చారు. భావితరాలకు తెలుగు సినిమా చరిత్రను అందించే ఉద్దేశంతోనే వరుసగా పుస్తకాలు వెలువరిస్తున్నానని రచయిత వినాయకరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి, బి. గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్. శంకర్, చదలవాడ శ్రీనివాసరావు, సారిపల్లి కొండలరావు తదితరులు మాట్లాడారు.