మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ | Anantham Movie Audio Launched | Sakshi
Sakshi News home page

మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ

Aug 19 2014 12:28 AM | Updated on Sep 2 2017 12:04 PM

మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ

మా అబ్బాయికి నటనపై మక్కువ : సుమ

నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర వ్యాఖ్యాత్రి సుమ తనయుడు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అనంతమ్’. పార్ధసారథి, వందిత నటిస్తున్న ఈ చిత్రానికి రమణలోక్‌వర్మ దర్శకుడు.

 నటుడు రాజీవ్ కనకాల, బుల్లితెర వ్యాఖ్యాత్రి సుమ తనయుడు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘అనంతమ్’. పార్ధసారథి, వందిత నటిస్తున్న ఈ చిత్రానికి రమణలోక్‌వర్మ దర్శకుడు. వి.శ్రవణ్‌కుమార్, పవన్‌కుమార్ నిర్మాతలు. సాకేత్‌సాయిరామ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను తమ్మారెడ్డి భరద్వాజ్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. పడిన కష్టానికి తగు ఫలితం లభిస్తుందనే నమ్మకం ఉందని రాజీవ్ కనకాల ఆశాభావం వెలిబుచ్చారు.
 
  సుమ మాట్లాడుతూ -‘‘చిన్నప్పట్నుంచీ మా అబ్బాయికి నటనపై మక్కువ. రాజీవ్ ప్రోత్సహిస్తున్నా, చదువు దెబ్బతింటుందని నేనే ఆపాను. ఏడాది క్రితం రమణలోక్‌వర్మ చెప్పిన కథ మాకు బాగా నచ్చి ఇద్దరం పచ్చజెండా ఊపేశాం. ఈ సినిమాకు పనిచేసిన అందరితో పాటు, మా అబ్బాయిక్కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు సునీల్‌కుమార్‌రెడ్డి, దేవీ ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, రామరాజు తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement