ఆకట్టుకుంటున్న మాస్‌ సాంగ్‌ ‘రాలే పువ్వే’ | Raale puvve Song Out From Average Student Nani | Sakshi
Sakshi News home page

Average Student Nani: ఆకట్టుకుంటున్న మాస్‌ సాంగ్‌ ‘రాలే పువ్వే’

Published Tue, Jul 30 2024 6:10 PM | Last Updated on Tue, Jul 30 2024 6:10 PM

Raale puvve Song Out From Average Student Nani

‘మెరిసే మెరిసే’ఫేం పవన్‌ కుమార్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహి​ంచిన తాజా చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదల కాబోతోంది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి రానుంది.

ఆల్రెడీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పీక్స్‌కు చేరుకున్నాయి. వరుసగా కంటెంట్‌ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఇప్పటికే పాటలు, టీజర్, పోస్టర్ అంటూ బజ్ క్రియేట్ చేశారు. తాజాగా మంచి మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ ఉన్న పాటను విడుదల చేశారు.

రాలే పువ్వే అంటూ సాగే పాటను తాజాగా రిలీజ్ చేశారు. కార్తీక్ బి కొడకండ్ల అందించిన క్యాచీ ట్యూన్‌.. భువనేశ్వర్ రాగిఫణి సాహిత్యం.. లక్ష్మీ శ్రావణి, కార్తీక్ బి కొడకండ్ల గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.  రాజ్ పైడి మాస్టర్ స్టెప్పులు కుర్రకారును కట్టిపడేసేలా ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement