నిజమైన నాయకుడు! | Srihari's 'Real Star' to be released in 21th | Sakshi
Sakshi News home page

నిజమైన నాయకుడు!

Published Sun, Nov 9 2014 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

నిజమైన నాయకుడు!

నిజమైన నాయకుడు!

 హీరోగా విలక్షణమైన పాత్రలు చేసి, జీవితంలో కూడా పదిమందికి సహాయం చేసి, హీరో అనిపించుకున్నారు స్వర్గీయ శ్రీహరి. అందుకే ఆయన్ను ‘రియల్‌స్టార్’ అంటారు. అదే టైటిల్‌తో శ్రీహరి హీరోగా రూపొందిన ఆ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ కీలక పాత్ర చేయగా, హంసానందిని కథానాయికగా నటించారు. సి.రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు నిర్మించారు. శ్రీహరి అభినయం హైలైట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాణ సారథి:  ఉగ్గిరాల సీతారామయ్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై. గిరిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement