కిక్ ఇచ్చే పాత్ర! | Looking beyond budget | Sakshi
Sakshi News home page

కిక్ ఇచ్చే పాత్ర!

Published Sat, Oct 11 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 PM

కిక్ ఇచ్చే పాత్ర!

కిక్ ఇచ్చే పాత్ర!

ఈ మధ్యకాలంలో ప్రత్యేక పాటలకు, అతిథి పాత్రలకు పరిమితమైన హంసా నందిని ‘రియల్ స్టార్’లో కథానాయికగా నటించారు. స్వర్గీయ శ్రీహరి టైటిల్ రోల్‌లో సి. రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావు దర్శకత్వంలో కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్  కీలక పాత్ర చేశారు.

ఈ నెలాఖరున ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘నిజజీవితంలో శ్రీహరి అందరివాడు అనిపించుకున్నారు. అందుకే ‘అందరివాడు’ అనేది ఈ చిత్రాన్ని ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. హంసా నందిని పాత్ర కిక్ ఇచ్చే విధంగా ఉంటుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పెద్దిరాజు, సహనిర్మాతలు: కె.వై.గిరిరాజ్, పులగం శ్రీనివాస్ ముదిరాజ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement