శ్రీహరి పుట్టినరోజుకి... | special character actor srihari in real star movie | Sakshi
Sakshi News home page

శ్రీహరి పుట్టినరోజుకి...

Published Sat, Aug 2 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

శ్రీహరి పుట్టినరోజుకి...

శ్రీహరి పుట్టినరోజుకి...

శ్రీహరి టైటిల్ రోల్‌లో, హంసానందిని నాయికగా నటించిన చిత్రం ‘రియల్ స్టార్’. చిగురుపాటి రామచంద్రయ్య సమర్పణలో ర్యాలి శ్రీనివాసరావును దర్శకునిగా పరిచయం చేస్తూ కొండపల్లి యోగానంద్, కట్టెల లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. వందేమాతరం శ్రీనివాస్ స్వరపరచిన పాటలను ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన తమ్మారెడ్డి భరద్వాజ్ ఆవిష్కరించి, తొలి సీడీని నిర్మాత సి. కల్యాణ్‌కు అందించారు.

శ్రీహరి పట్టుబట్టి ఇందులో తనతో ఓ ముఖ్య పాత్ర చేయించారనీ, తమ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని భరద్వాజ్ అన్నారు. వెండితెరపైనే కాదు.. నిజజీవితంలోనూ హీరో అనిపించుకున్న శ్రీహరి నటించిన ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. శ్రీహరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్ట్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ ఆడియో వేడుకలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కొడాలి వెంకటేశ్వరరావు, అమ్రిష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement