సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సూచనలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) స్పందించింది. డ్రగ్స్, సైబర్ క్రైమ్ విషయాల్లో ప్రభుత్వానికి సహకరిస్తాం అని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు మరియు థియేటర్స్ యాజమాన్యాలతో మాట్లాడని ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌ని కలిసి మాట్లాడతామని ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇకపై ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే.. సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేస్తూ ఓ వీడియో చేయాలని సూచించారు. అలా అయితే టికెట్ ధరలు పెంచుతామని కండీషన్ పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment