సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపుల ఆరోపణలతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైంది. దీనిపై తెలుగు ఫిలిం ఛాంబర్ స్పందించింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో సభ్యులైన జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు అందిందని ఫిలిం ఛాంబర్ గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.
విచారణ చేపడతాం
దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌కు సిఫార్సు చేసిట్లు తెలిపారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయిన తర్వాత POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. బాధితురాలి ఫోటోలను, వీడియోలను దయచేసి ఎవరూ ఉపయోగించవద్దని కోరారు.
అసలేమైంది?
మధ్యప్రదేశ్‌కు చెందిన యువతికి 2017లో జానీ మాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. 2019లో అతడి వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరింది. ఓ షో కోసం అతడితోపాటు ముంబై వెళ్లగా ఆ సమయంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని, ఈ విషయం బయటపెడితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలోనూ తనను వేధించేవాడని తెలిపింది. తనకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడని, అతడి నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment