లైంగిక వేధింపుల కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు కొద్దిరోజుల క్రితం జానీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే, ఈ క్రమంలో బెయిల్ కోసం రంగారెడ్డి కోర్టులో జానీ ఒక పిటీషన్ పెట్టుకున్నారు. తాజాగా న్యాయస్థానంలో తన బెయిల్‌పై విచారణ పూర్తి అయింది.
ఇప్పటికే పలుమార్లు జానీ బెయిల్ పిటీషన్‌పై విచారణ వాయిదా పడింది. కానీ, నేడు (అక్టోబర్ 14) జానీ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. కేసు విచారణ పూర్తి అయిన అనంతరం రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. బెయిల్ వస్తుందని ఆశలు పెట్టుకున్న జానీకి కోర్టులో నిరాశ ఎదురైంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఆయన ఉన్నారు.
జానీ మాస్టర్ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్ 15న నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం బయట చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని జానీ భయపెట్టాడంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో పోక్సో కేసుగా నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment