‘తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని ఎలా అధిగమించాలి? ఎవరెవరు ఏయే త్యాగాలు చేయాలి? అనే అంశంపై అన్ని శాఖలవారూ చర్చిస్తున్నాం. ఈ చర్చలకు అందరూ పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ఈ సమావేశాల వివరాలను త్వరలో తెలుపుతాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment