TFCC Election 2023: Telugu Film Chamber Of Commerce Election Updates - Sakshi
Sakshi News home page

TFCC Election Live Update: తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా దిల్‌రాజు

Published Sun, Jul 30 2023 9:15 AM | Last Updated on Sun, Jul 30 2023 9:30 PM

TFCC Election 2023: Telugu Film Chamber Of Commerce Election Updates - Sakshi

TFCC Election 2023: Telugu Film Chamber Of Commerce Election Updates

తెలుగు ఫిలిం చాంబర్ ,ప్రెసిడెంట్ గా దిల్ రాజు

వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల రామదాసు

కార్యదర్శి గా దామోదర్ ప్రసాద్

ట్రెజేరర్ గా ప్రసన్న కుమార్

మొత్తం 48 ఓట్ల లో దిల్ రాజుకి 31 ఓట్లు

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు

ప్రొడ్యూసర్ సెక్టర్ ఛైర్మన్ గా శివలంక కృష్ణ ప్రసాద్.

డిస్ట్రిబ్యూటర్ సెక్టర్ చైర్మన్ గా మిక్కిలినేని సుధాకర్..

తెలుగు ఫిల్మ్ ఛాంబర్  అధ్యక్షుడి గా దిల్ రాజు ఎన్నిక దాదాపు ఖాయం.

తెలుగు ఫిలిం చాంబర్ ఎన్నికలు.

ఫైనల్ రిజల్ట్

అధ్యక్ష పదవి కి పోటీపడుతున్న సి.కళ్యాణ్, దిల్ రాజు..

మొత్తం ఓట్లు - 48

మెజారిటీ మార్క్ - 25

ప్రొడ్యూసర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12)
దిల్ రాజు కి 7, సి కళ్యాణ్ కి 5..

డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (12) 
దిల్ రాజుకి 6, సి కళ్యాణ్ కి 6.

స్టూడియో ఎగ్జిక్యూటివ్ కమిటీ (4)
దిల్ రాజుకి 3, సి కళ్యాణ్ కి 1.

ఎగ్జిబిటర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (16)
దిల్ రాజు కి 8 , సి కళ్యాణ్ కి 8.

కీలకంగా మారిన సెక్టార్ ప్రెసిడెంట్ ఓట్లు (4)

►  తెలుగు ఫిలిం ఛాంబర్స్‌ ఎన్నికల్లో దిల్‌రాజు ప్యానెల్‌ భారీ విజయం

► నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్‌ నుంచి 12 మందిలో ఏడుగురు గెలుపొందారు

►  దిల్‌రాజు, దామోదర ప్రసాద్‌, మోహన్‌ వడ్లపాటి, స్రవంతి రవికిశోర్‌, పద్మిని, రవిశంకర్‌ యలమంచిలి, మోహన్‌గౌడ్‌లు నిర్మాతల విభాగంలో దిల్‌రాజు ప్యానెల్‌ నుంచి గెలిచారు.

► డిస్ట్రిబ్యూషన్‌ విభాగంలో​ ఇరు ప్యానెల్‌ నుంచి సమానంగా ఆరుగురి చొప్పున గెలుపొందారు.
► స్టూడియో సెక్టార్‌లో నలుగురికి గాను దిల్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ముగ్గురు గెలుపొందారు.

► తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రొడ్యూసర్స్ సెక్టార్ లో దిల్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉంది. మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్ కు 563 ఓట్లు వచ్చాయి. సి.కల్యాణ్ ప్యానెల్ కు 497 ఓట్లు వచ్చాయి.

► మొదట స్టూడియో సెక్టార్ ఓట్లు లెక్కింపు అయిన  తరువాత డిస్ట్రిబ్యూటర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ఫైనల్‌గా ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఓట్లు లెక్కింపు ఉంటుంది.

 ఫిలిం ఛాంబర్ ఎన్నికల పోలింగ్‌ 3:30 నిమిషాలకు ముగిసింది. మొత్తం 1339 ఓట్లు పోలైయ్యాయి. ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 891,స్టూడియో సెక్టార్ నుంచి 68,డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 380 ఓట్లు నమోదయ్యాయి. ఈసారి రికార్టు స్థాయిలో పోలింగ్‌ జరిగింది. నాలుగు గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమై.. 6 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.

 ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో ఇప్పటి వరకు(మధ్యాహ్నం 3 గంటలు) 1233 ఓట్లు పోలైయ్యాయి.  ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 810 , స్టూడియో సెక్టార్ నుంచి 68,  డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 355 ఓట్లు నమోదయ్యాయయి. 

 ఫిల్మ్‌ చాంబర్‌ ఎన్నికలు జనరల్‌ ఎన్నికల్లా జరుగుతున్నాయని, ఎవరు గెలిచినా నిర్మాతల కష్టాలు తీర్చాలని నటుడు ఆర్‌. నారాయణమూర్తి కోరారు. ఆదివారం ఫిల్మ్‌ చాంబర్‌లో జరుగుతున్న ఎన్నికల్లో ఆయన పాల్గొని తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 

 మధ్యాహ్నం 1.30 గంటల వరకు  1035 ఓట్లు పోలైయ్యాయి.  ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 650, స్టూడియో సెక్టార్‌ నుంచి 65, డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ నుంచి 320 ఓట్లు నమోదయ్యాయి. 

సినీ ప్రముఖులు సురేశ్‌ బాబు, ఆదిశేషగిరిరావు, రాఘవేంద్రరావు, శ్యాంప్రసాద్‌ రెడ్డి, జీవిత తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని, వాటంన్నింటిని పరిష్కరించే సామర్థ్యం ఎవరికి ఉందో ఆలోచించి ఓటు​ వేయాలని నటి, దర్శకురాలు జీవిత విజ్ఞప్తి చేశారు. కోవిడ్‌ టైమ్‌లో ఫిల్మ్‌ ఇండస్ట్రీ చాలా ప్రాబ్లమ్స్‌ చూసిందని, అలాంటి విపత్కర పరిస్థితులు వస్తే ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఒకటికి పదిసార్లు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. తాను దిల్‌ రాజు వర్గానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. 

► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో మధ్యాహ్నం 12 గంటలకు మొత్తం 710 ఓట్లు పోలైయ్యాయి. వాటిలో ప్రొడ్యూసర్ సెక్టర్ నుంచి 450, స్టూడియో సెక్టార్‌ నుంచి 50, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి 210 ఓట్లు నమోదయ్యాయి. 

► చాంబర్‌ ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్‌ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్‌ ఎలెక్షన్స్‌లాగా ఉందని సిగ్గు పడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు. ‘నేను కూడా చాలా ఎలెక్షన్స్‌ చూశాను.ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్‌ కాంపెయిన్‌ చూస్తుంటే భయమేస్తుంది’ అన్నారు. 

► ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో  ఉదయం 10.45 వరకు దాదాపు 232 ఓట్లు పోలైయ్యాయి.  ప్రొడ్యూసర్ సెక్టర్ లో 95 ఓట్లు,  స్టూడియో సెక్టార్ లో 35 ఓట్లు,  డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లో 102 ఓట్లు పోలైయ్యాయి. 

►  టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతుంది.  ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున​ ఫిల్మ్‌ చాంబర్‌కు తరలి వస్తున్నారు. అధ్యక్ష బరిలో నిలిచిన దిల్‌ రాజు, సి. కల్యాణ్‌ ఫిల్మ్‌ చాంబర్‌కు చేరుకొని పోలింగ్‌ని పరిశీలిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. విజేతలను సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తారు.  సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఎఫ్‌డీసీ చైర్మన్‌, నటుడు పోసాని కృష్ణమురళి, నిర్మాత సుప్రియ, గుణశేఖర్‌ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటల వరకు మొత్తం 104 ఓట్లు పోలైయ్యాయి. 

టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్.. ఇలా దాదాపు మొత్తం సభ్యులు 1600 మంది సభ్యులు ఉన్నారు.

► ఈ రోజు దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెల్లడవుతాయి. ఈ సారి ఈ ఎలక్షన్స్ మరింత రసవత్తరంగా మారాయి. స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీ పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement