![Telugu Film Chamber Of Commerce Thanks to AP Government - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/14/Telugu.jpg.webp?itok=DfTW2j07)
ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లను 100 శాతం ఆక్యుపెన్సీతో నడపొచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది ఫిలిం ఛాంబర్. ఈ మేరకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్.. సీఎం జగన్, మంత్రి పేర్ని నానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ... 'మా సినిమా ఇండస్ట్రీ కష్టాలను అర్థం చేసుకొని ప్రభుత్వం 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఆంధ్రలో సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంటుంది. మా సమస్యలను ప్రభుత్వాలకే చెప్పుకుంటాం. రెండు రాష్ట్రాల ముఖ్య మంత్రులు వాటిని పరిష్కరించండి. టిక్కెట్ రెట్లు, కరెంట్ బిల్లులు మొదలగు సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాము' అని తెలిపారు.
ఛాంబర్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... 'వంద శాతం ఆక్యుపెన్సి జీవో ఇచ్చినందుకు ధన్యవాదాలు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. షూటింగ్‌లకు పర్మిషన్, కరెంట్ బిల్లులు ఆన్‌లైన్ టిక్కెట్ రేట్లతో పాటు మిగిలిన సమస్యలను పరిష్కరించండి' అని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment