![Tollywood Hero Naga Chaitanya Thandel Movie Gets Into Trouble](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Thandel-Movie.jpg.webp?itok=6MgI9dte)
అక్కినేని హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం తండేల్. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా నిర్మించి మా మత్స్యకారుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మండిపడ్డారు. 22 మందిని పాకిస్తాన్ నుంచి తీసుకువస్తే.. ప్రేమకథ సినిమా తీస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ సినిమాలో రియల్ హీరో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు.
మేకనైజడ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా నిర్మించి మా మత్స్యకారులు మనోభావాలు దెబ్బతీశారు. ఈ సినిమాలో రియల్ హీరో ఆనాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన 22 మందిని పాకిస్థాన్ జైలు నుంచి తీసుకొని వస్తె.. ప్రేమ కథ సినిమా తీస్తారా..? 22 మంది కుటుంబాలకి ప్రేమ లేదా ఒక్కరికే ప్రేమ ఉంటుందా? వారిని జైలు నుంచి విడుదల చేయడానికి మత్స్యకార నాయకులు కాళ్లు అరిగేలా తిరిగారు అని' మూవీ మేకర్స్‌ను నిలదీశారు.
తండేల్ కథపై జానకి రామ్ మాట్లాడుతూ..'తండేల్ సినిమా అంతా కల్పితం. దాదాపు 22 మందిని జైల్లో వేశారు. మత్స్యకార నేతలు ఎంతో కష్టపడి వారిని విడిపించారు. అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరో. ఎక్కడా కూడా ఈ సినిమాలో రియాలిటీ కనిపించలేదు. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను పూర్తిగా వక్రీకరించారు. మత్స్యకారుల జీవితంలో ముడిపడి ఉన్న సెంటిమెంట్స్‌ను బిజినెస్‌గా మార్చుకున్నారు. కేవలం డబ్బు కోసమే ప్రేమకథగా తెరకెక్కించారు. 22 మంది జైలుకు పోతే లవ్ స్టోరీ ఎక్కడి నుంచి వస్తుంది. 22 మంది జైలుకు వెళ్లితే.. 20 మంది మాత్రమే విడుదలయ్యారు. వీళ్లను విడిపించేందుకు కష్టపడిన మత్స్యకార నేతలు, అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డినే నిజమైన తండేల్ హీరోలు అని' కొనియాడారు
Comments
Please login to add a commentAdd a comment