![Tammareddy Bharadwaj Sensational Comments On TFCC Election 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/30/thama-reddy.jpg.webp?itok=w2fm9cdj)
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ)ఎన్నికలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాతావరణం చూస్తుంటే చాంబర్ ఎదిగిందని సంతోష పడాలో లేదా జనరల్ ఎలెక్షన్స్‌లాగా ఉందని సిగ్గుపడాలో తెలియట్లేదన్నారు. సభ్యులు దేనికి పోటీ పడుతున్నారో? ఎందుకు కొట్టుకుంటున్నారో తెలియడం లేదన్నారు.
‘నేను కూడా చాలా ఎలెక్షన్స్ చూశాను.ఫిల్మ్ చాంబర్ ప్రెసిడెంట్‌గా కూడా గెలిచాను. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడూ లేదు. ప్రస్తుతం ఎలెక్షన్స్ కాంపెయిన్ చూస్తుంటే భయమేస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నాను’అని తమ్మారెడ్డి అన్నారు.
కాగా, టీఎఫ్‌సీసీ ఎన్నికల పోలింగ్ వాడివేడిగా జరుగుతోంది. రెండేళ్లకు ఒక్కసారి జరిగే ఎన్నికల్లో ఈ సారి అధ్యక్ష బరిలో దిల్ రాజు, సీ. కల్యాణ్ పోటీ పడుతున్నారు. ఈ రోజు(జులై 30) ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ప్రొడ్యూసర్ సెక్టార్, డిస్ట్రిబ్యూషన్ సెక్టార్, స్టూడియో సెక్టార్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ ఇలా నాలుగు సెక్టార్లలోని సభ్యులు ఇందులో ఓటర్లుగా ఉంటారు. మొత్తం 1600 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 900 వరకు ఓట్లు నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 6 గంటల తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment