తెలుగు ఫిలిం చాంబర్ సోమవారం(ఆగస్ట్ 1) నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ నిలిపివేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి ప్రొడ్యుసర్స్ గిల్డ్ కూడ అంగీకారం చెప్పడంతో నేటి నుంచి షూటింగ్‌లు నిలిచిపోయాయి. తాజాగా షూటింగ్‌ల బంద్‌పై సీనియర్ నటుడు సమమన్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖలో పర్యటించిన ఆయన ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదన్నారు. దీనివల్ల ఓటీటీకి ఏమౌతుందని, ఏం కాదంటూ వ్యాఖ్యానించారు.
చదవండి: సెట్‌లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
‘ఇండస్ట్రీలోని సమస్యలను చర్చించుకోవడానికి షూటింగ్‌లు నిలిపివేడయం సరికాదు. హీరోల రెమ్యునరేషన్ తగ్గించుకోవలానడం సబబు కాదు. క్రేజ్ ఉన్నప్పుడే హీరోలకు రెమ్యునరేషన్ ఇస్తారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే డిమాండ్ అండ్ సప్లై’ అన్నారు. అనంతరం షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలని నిర్మాతలకు సూచించారు. ‘షూటింగ్ సమయాన్ని పెంచుకోవాలి. రెండు రోజుల చేసే వర్క్‌ని ఒక రోజులో చేయండి. అవసరం మేరకే కాల్‌షీట్ తీసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్ కాల్‌షీట్ తీసుకోవాలి. వర్క్ ఫాస్ట్‌గా చేయాలి. అంతేకాని రేట్స్ తగ్గించకోండి. రెమ్యునరేషన్ తగ్గించుకోండనడం కరెక్ట్ కాదు.
చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై
వారు మాకు క్లోజ్ అని, మా ఫ్యామిలీ అంటూ కొందరు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్లు వెళ్లి మాట్లాడండి. దీంట్లో రిలేషన్ షిప్ అనేది ఏం ఉండదు. డబ్బు ఇస్తున్నారు కదా తొందరగా రావాలని గట్టిగా చెప్పండి. మేనేజర్లు అక్కడ పెట్టడం కాదు. ఇవన్ని స్వయంగా నిర్మాతే చూసుకోవాలి. మా టైంలో అవుట్ డోర్ షూటింగ్ అంటే పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు పనిచేసే వాళ్లం. అదే ఇప్పడు 9 గంటలకు వస్తున్నారు. 6 గంటలకే ప్యాకప్ చెప్పేస్తున్నారు. ఇలా అయితే ఖర్చు పెరగదా. ఒకప్పుడ. లేట్ అయితే అడగాలి. వర్క్ షాప్ చేయాలి. ఒకప్పుడ భయ్యర్ సినిమా కోనేవాడు. సినిమ ఫ్లాప్ అయితే అతడిని ఎవరు పట్టించుకోరు. రెట్స్ తగ్గించుకోమ్మంటున్నారు. మరి భయ్యర్ పరిస్థితేంటి?’ అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment