ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఆదిపురుష్ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. మొదటి మూడు రోజులు భారీ లెవల్‌లో కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాత వసూళ్లు రాబట్టడంలో ఘోరంగా వెనకబడింది. ఇకపోతే శ్రీరామదాసులో రాముడిగా నటించిన సీనియర్ నటుడు సుమన్ తాజాగా ఆదిపురుష్‌పై స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. 'రావణుడు సీతను ఎత్తుకుపోవడం నుంచి ఆమెను రక్షించడం వరకు మాత్రమే ఆదిపురుష్ తీశారు. మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాముడిని నీలిరంగులోనే చూశాం.
అలాగే రాముడికి మీసాలు, గడ్డాలు కూడా ఉండవు. కానీ ఇందులో రాముడిని సాదాగా చూపించారు. అది చాలా పెద్ద రిస్క్. అయినా రెండున్నరేళ్లపాటు ప్రభాస్ ఆ బాడీని మెయింటైన్ చేయడం చిన్న విషయం కాదు. అందుకు అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. రావణుడికి మోడ్రన్ హెయిర్ కట్ చేశారు. వేషధారణ మార్చారు. అది చాలా తప్పు. ఇలా డైరెక్టర్ చేసిన కొన్ని ప్రయోగాలు సినిమాలో ఇబ్బందికరంగా అనిపిస్తాయి. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ బాగున్నాయి. మరికొన్నిచోట్ల గ్రాఫిక్స్ పాతదానిలా ఉన్నాయి.
చదవండి: ఆదిపురుష్ 5 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?
పాటలు నచ్చాయి. కృతీ సనన్ సీత క్యారెక్టర్‌లో బాగా చేసింది. ఈ సినిమాలో ఎమోషన్ మిస్ అయింది. చాలా చోట్ల సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను గుర్తుకు తెచ్చాయి. ఈ తప్పులు చేయకపోయి ఉంటే ఇది అంతర్జాతీయ సినిమా అయి ఉండేది. ఆదిపురుష్ అనేది పవర్‌ఫుల్ టైటిల్.. కానీ సినిమా చూసి నిరాశ చెందాను. మైథాలజీ సినిమాలను దక్షిణాదివాళ్లే బాగా హ్యాండిల్ చేస్తారు' అని చెప్పుకొచ్చాడు సుమన్.
చదవండి: ప్రేమలో అబద్ధాలు, మోసాలు నచ్చవు: రకుల్ ప్రీత్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment