Prabhas Adipurush Movie World Wide Box Office Closing Collections, Deets Inside - Sakshi

Adipurush Movie Closing Collections: 'ఆదిపురుష్' హడావుడికి ఎండ్ కార్డ్.. ఆ రోజుతో!

Published Mon, Jul 3 2023 6:55 PM | Last Updated on Tue, Jul 4 2023 11:55 AM

Prabhas Adipurush Closing Collection - Sakshi

ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో బరిలోకి దిగిన 'ఆదిపురుష్' హంగామా చివరికొచ్చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హడావుడి పూర్తిగా తగ్గిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అలానే కొన్నిచోట్ల ఈ మూవీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది! 'ఆదిపురుష్'కి థియేటర్లలో అదే చివరిరోజని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది?

(ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ))

ప్రస్తుత పరిస్థితి?
'ఆదిపురుష్' సందడి తొలివారం రోజుల మాత్రమే థియేటర్ల దగ్గర కనిపించింది. కరెక్ట్ గా చెప్పాలంటే సినిమా విడుదలైన వీకెండ్ అంటే మూడు రోజుల‍్లో రూ.340 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వసూళ్లలో ఘోరమైన డ్రాప్ కనిపించింది. 10 రోజుల్లో రూ.450 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి పెద్దగా బాలేదు. కొన‍్ని థియేటర్లలో ఈ వారం తర్వాత 'ఆదిపురుష్' తీసేయబోతున్నట్లు సమాచారం. కేవలం మనదేశంలో రూ.300 కోట్ల వసూళ్ల మార్క్ ని ఇంకా దాటలేదని టాక్.

ఓటీటీల‍్లోకి అప్పుడే!
'ఆదిపురుష్' రిజల్ట్ సంగతి పక్కనబెడితే... టీజర్ రిలీజైన దగ్గర నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో ఎంతలా ట్రోల్ చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కాదన్నట్లు కొన్నిరోజుల ముందు పైరసీలో ఈ మూవీ తమిళ వెర్షన్ లీక్ అయిపోయింది. దీంతో మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' గేమ్ ఓవర్ అయిపోయినట్లు అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
 
Advertisement