విరాట్ కోహ్లి అవుట్ అవుతాడన్నా, అభిమాన హీరో సినిమా బాలేదన్నా ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంటుంది. అందుకే అలాంటి అభిమానుల మధ్య ఆచితూచి మాట్లాడాలి. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకంటే.. శుక్రవారం (జూన్ 16న) ఆదిపురుష్ సినిమా రిలీజైంది. థియేటర్ నుంచి బయటకు వస్తున్న పబ్లిక్ సినిమా ఎలా ఉందో చెప్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి సినిమా బాలేదంటూ మీడియా ముందు మాట్లాడాడు.
'ఆచార్య గ్రాఫిక్స్‌లో చిరంజీవిని ఎలా చూశామో.. ఇందులో ప్రభాస్‌ను త్రీడీలో అలా చూపించారు. గేమ్స్‌లో కనిపించే రాక్షసులందరినీ ఇక్కడ పెట్టారు. హనుమంతుడు, బ్యాగ్రౌండ్ స్కోర్, అక్కడక్కడా త్రీడీ షాట్స్ తప్ప సినిమాలో ఏం లేదు. ప్రభాస్‌కు రాముడి గెటప్ అస్సలు సెట్ కాలేదు. బాహుబలి చూసి ప్రభాస్‌ను ఇందులో తీసుకున్నారు కానీ ఓం రౌత్ అతడిని సరిగా చూపించలేదు' అని రివ్యూ ఇచ్చాడు. ఇది విన్న ప్రభాస్ అభిమానులు అతడి దుర్భాషలాడారు. వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో అంటూ బెదిరింపులకు దిగారు. అంతలోనే అతడిని పట్టుకుని చితక్కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
తాజాగా ఈ ఘటనపై దెబ్బలు తిన్న వ్యక్తి స్పందిస్తూ.. 'నేను కావాలని ట్రోల్ చేస్తున్నారనుకున్నారు. నేనేమీ ట్రోల్ చేయడం లేదు, సినిమా చూసే చెప్తున్నా. అయినా వాళ్లు వినిపించుకోలేదు.. ఇంకా గలీజ్‌గా మాట్లాడారు. నేను కూడా తగ్గలేదు.. అక్కడ చూసిందే కదా చెప్తున్నాను. హీరోలను ట్రోల్ చేస్తే నాకేం రాదు. ఉన్నది ఉన్నట్లు చెప్తే అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వాళ్ల కోపం డైరెక్టర్ మీద చూపించలేక నా మీద చూపించారు.
చాలా సినిమాలకు నేను రివ్యూ ఇచ్చాను. సినిమా బాగుంటే బాగుందని, లేదంటే బాలేదని చెప్పాను. కానీ ఎన్నడూ ఇలా జరగలేదు. ఇలా కొట్టడం నాకు నచ్చలేదు. అయినా కూడా నాకు వాళ్లపై కోపం రావట్లేదు, జాలేస్తోంది. ఎందుకంటే మా హీరో రాముడు గెటప్ వేసుకున్నాడని వచ్చిన ఫ్యాన్స్ నిరాశతో వెళ్లిపోతుంటే పక్కన నాలాంటివాడు సినిమా బాలేదని జెన్యూన్‌గా చెప్తుంటే వాళ్లకు ఎవరిని ఏమనాలో తెలియక నామీద పడ్డారు. ఒకవేళ ఈ వీడియో ప్రభాస్ చూసి నాపై జాలిపడితే అంతకంటే ఏం కావాలి? ఇంటికి పిలిచి భోజనం పెడితే ఇంకా హ్యాపీగా ఫీలవుతా.. ఇంతకీ నేను వెజిటేరియన్‌ను' అని చెప్పుకొచ్చాడు.
#Adipurush - #Prabhas fans beating the public for giving genuine review 🙄
— VCD (@VCDtweets) June 16, 2023
Worst behavior 👍#AdipurushTickets #AdipurushOnJune16pic.twitter.com/zV8waEWm4z
Comments
Please login to add a commentAdd a comment