Monkey Spotted In Prabhas Adipurush Movie Screening Time In Theatre, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Hanuman In Adipurush Theatre: 'ఆదిపురుష్' కోసం వచ్చిన మారుతి.. వీడియో వైరల్!

Published Fri, Jun 16 2023 10:29 AM | Last Updated on Fri, Jun 16 2023 11:02 AM

Monkey Spotted In Adipurush Theatre video viral - Sakshi

'ఆదిపురుష్'పై ఎవరెన్ని ట్రోల్స్ చేసినా సరే ఇది మన రామాయణం ఆధారంగా తీశారు. ప్రభాస్ రాముడిగా నటించడం మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదంతా పక్కనబెడితే 'ఆదిపురుష్' మేకర్స్ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి థియేటర్ లోనూ ఓ సీటుని హనుమాన్ కోసం కేటాయించారు. 

రామాయణం ప్రదర్శించే ప్రతిచోటుకి హనుమంతుడు వస్తాడని భక్తులు నమ్ముతారు. 'ఆదిపురుష్' నిర్మాతలు కూడా ఇదే విషయాన్ని తూచ తప‍్పకుండా పాటించారు. మూవీ స్క్రీన్ అవుతున్న అన్నీ థియేటర్లలోనూ హనుమాన్ కోసం ఓ సీటుని విడిచిపెట్టారు. ఇప్పుడు దాన్ని నిజం చేసేలా ఓ థియేటర్ లో నిజంగానే హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు.

కరెక్ట్ గా చెప్పాలంటే 'ఆదిపురుష్' సినిమా స్క్రీన్ పై ప్లే అవుతున్న ఓ థియేటర్ లో మారుతి(కోతి) కనిపించింది. ఓ చోట కూర్చుని సినిమా చూస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఓ అభిమాని దీన్ని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అదికాస్త వైరల్ గా మారింది. అందరూ చెబుతుంటే కల‍్పితం అనుకున్నాం గానీ 'ఆదిపురుష్' కోసం హనుమంతుడు నిజంగానే వచ్చాడని ఈ వీడియో ప్రూవ్ చేసింది.

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement