డార్లింగ్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య జూన్ 16న రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్‌కు మాత్రం ఎటువంటి ఢోకా లేనట్లు కనిపిస్తోంది. మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.340 కోట్లు రాబట్టింది. ఇకపోతే ఈ సినిమాలో నటించేందుకు ప్రభాస్ అంత ఈజీగా ఏం ఒప్పుకోలేదంటున్నాడు ఓం రౌత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'నిజం చెప్తున్నా.. ప్రభాస్ ఈ సినిమాను అంత ఈజీగా ఒప్పుకోలేదు. కరోనా సమయంలో ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాను. నేను ఏ రోల్ చేయాలని ఆశిస్తున్నావ్? అని ప్రభాస్ అడిగాడు.
జూమ్ కాల్.. ఆ తర్వాత హైదరాబాద్‌కు
శ్రీరాముడి పాత్రలో అంటే రాఘవుడిగా నటించాలని చెప్పాను. నువ్వు సీరియస్‌గా అంటున్నావా? అని అడిగితే అవునని బదులిచ్చాను. అయినా ఇలా జూమ్ కాల్‌లో స్క్రిప్ట్ వివరించడం ఎలా కుదురుతుంది? అన్నాడు. నేను వెంటనే ఆలస్యం చేయకుండా హైదరాబాద్‌లో వాలిపోయాను. కథ చెప్పాను, పూర్తిగా విన్నాక అతడు ఓకే అన్నాడు. నాకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నాడు. నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆ దేవుడి దయ వల్ల భవిష్యత్తులో కూడా అతడు నావెంట ఉంటే బాగుండు.
ఇప్పటి జనరేషన్ కోసం ఆదిపురుష్
ఆదిపురుష్‌లో రాఘవుడి పాత్రకు నేను అనుకున్న ఏకైక ఛాయిస్ ప్రభాసే.. నేను అనుకున్నట్లే అతడు దొరికాడు. ఈ సినిమా ఇప్పటి జనరేషన్ కోసం తీసింది. యువత కోసం తీశాను. పూర్తి రామాయణాన్ని స్క్రీన్‌పై చూపించడం అసాధ్యం. అందుకే నేను యుద్ధకాండ భాగం తీసుకున్నాను. ఈ అధ్యాయంలో రాముడు పరాక్రమవంతుడిగా ఉంటాడు, నేను కూడా అదే చూపించడానికి ప్రయత్నించాను' అని చెప్పుకొచ్చాడు ఓం రౌత్.
చదవండి: బాక్సాఫీస్ వద్ద ఆదిపురుష్ ప్రభంజనం.. మూడో రోజు ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment