Prabhas Adipurush 3D Teaser Special Shows In Theaters On Friday - Sakshi
Sakshi News home page

Prabhas Adipurush 3D Teaser: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్.. రెడీగా ఉండండమ్మా!

Published Thu, Oct 6 2022 7:31 PM | Last Updated on Thu, Oct 6 2022 10:13 PM

Prabhas Adipurush 3D Teaser Special Shows On Theatres On Friday - Sakshi

యంగ్ ‍రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆదిపురుష్ టీం. టీజర్‌పై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆదిపురుష్ టీజర్‌ను త్రీడిలో చూసేందుకు ఫ్యాన్స్‌ అవకాశం కల్పించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో త్రీడి టీజర్‌ను ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య ప్రత్యేక షోలు వేయనున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది.

(చదవండి: ఆదిపురుష్‌పై ఆగని ఆరోపణలు.. ప్రభాస్ పోస్టర్‌ లుక్ మాదే..!)

కాగా.. ఇటీవల అయోధ్య వేదికగా టీజర్ రిలీజవగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రోజురోజుకు ఆదిపురుష్‌ టీజర్‌పై విమర్శలు పెరిగిపోతున్నాయి. విడుదలైనప్పటి నుంచి దీనిపై సాధారణ ప్రజలు, ఫ్యాన్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో రామాయణాన్ని తప్పుగా చూపించారంటూ డైరెక్టర్‌ ఓం రౌత్‌పై మండిపడుతున్నారు. రామాయణంలో రావణుడు, హనుమంతుడి పాత్రలను డైరెక్టర్‌ వక్రీకరించారంటూ హిందు సంఘాలు, బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement