పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' టీజర్‌పై రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ టీజర్‌పై టీవీ షో ‘మహాభారత్’లో భీష్ముడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ముఖేష్ ఖన్నా తనదైన శైలిలో కౌంటరిచ్చారు. రాముడు, కృష్ణుడు బాడీ బిల్డర్లు కాదని విమర్శించారు. ప్రభాస్ రాముడిగా ఓంరౌత్ రూపొందిస్తున్న మైథలాజికల్ సినిమా ‘ఆది పురుష్’. సీతగా కృతి సనన్, రావణుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
(చదవండి: ట్రెండింగ్‌లో బాయ్‌కాట్ ఆదిపురుష్.. ‘బాలీవుడ్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’)
ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ.. 'అందరూ నాతో ఏకీభవించకపోవచ్చు. కానీ హిందూ దేవుళ్లు బాడీబిల్డర్లు కాదు. వారి ముఖాలు మృదువైన గొప్ప రూపాన్ని కలిగి ఉంటాయి. మనం చూసిన రామునికి గడ్డం, మీసాలు లేవని మేము నమ్ముతున్నాం. హనుమాన్ జీ ముఖచిత్రం ప్రజల మనస్సుల్లో ఉంది. మీరు అతనిని సినిమాలో ఎలా చూపించారు. మీరు రామాయణ పాత్రల రూపాన్ని మార్చలేరు.సైఫ్ అలీఖాన్ పాత్రకు మొఘల్ లుక్ వచ్చింది. వీఎఫ్‌ఎక్స్‌తో రూ.1000 కోట్లు ఖర్చు రామాయణం తీయలేరు. ఇది విలువలు, పాత్రలు డైలాగ్స్, లుక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ మీరు దీన్ని అవతార్ లాగా తీయాలనుకుంటున్నారు. అప్పుడు మీరు రామాయణం చేస్తున్నాం అని చెప్పడం మానేయండి. మా ఆచారాలు, ఇతిహాసాలను మార్చడానికి మీ డబ్బును వృథా చేసుకోవద్దు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment