collection - Final
-
ప్రభాస్ 'ఆదిపురుష్'.. గేమ్ ఓవర్?
ఎన్నో అంచనాలతో పాన్ ఇండియా లెవల్లో బరిలోకి దిగిన 'ఆదిపురుష్' హంగామా చివరికొచ్చేసినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హడావుడి పూర్తిగా తగ్గిపోయినట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. అలానే కొన్నిచోట్ల ఈ మూవీ పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది! 'ఆదిపురుష్'కి థియేటర్లలో అదే చివరిరోజని అంటున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: 'గుడ్ నైట్' సినిమా రివ్యూ (ఓటీటీ)) ప్రస్తుత పరిస్థితి? 'ఆదిపురుష్' సందడి తొలివారం రోజుల మాత్రమే థియేటర్ల దగ్గర కనిపించింది. కరెక్ట్ గా చెప్పాలంటే సినిమా విడుదలైన వీకెండ్ అంటే మూడు రోజుల్లో రూ.340 కోట్ల గ్రాస్ వచ్చిందని నిర్మాతలు అనౌన్స్ చేశారు. ఆ తర్వాత వసూళ్లలో ఘోరమైన డ్రాప్ కనిపించింది. 10 రోజుల్లో రూ.450 కోట్ల గ్రాస్ సాధించినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు పరిస్థితి పెద్దగా బాలేదు. కొన్ని థియేటర్లలో ఈ వారం తర్వాత 'ఆదిపురుష్' తీసేయబోతున్నట్లు సమాచారం. కేవలం మనదేశంలో రూ.300 కోట్ల వసూళ్ల మార్క్ ని ఇంకా దాటలేదని టాక్. ఓటీటీల్లోకి అప్పుడే! 'ఆదిపురుష్' రిజల్ట్ సంగతి పక్కనబెడితే... టీజర్ రిలీజైన దగ్గర నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ విషయంలో ఎంతలా ట్రోల్ చేశారో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది కాదన్నట్లు కొన్నిరోజుల ముందు పైరసీలో ఈ మూవీ తమిళ వెర్షన్ లీక్ అయిపోయింది. దీంతో మరో 1-2 వారాల్లో 'ఆదిపురుష్' ఓటీటీలోకి వచ్చేయబోతున్నట్లు సమాచారం. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' గేమ్ ఓవర్ అయిపోయినట్లు అనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) -
హంద్రీ-నీవాపై ఉద్యమబాట
ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులేమయ్యాయి ? పనుల జాప్యానికి నిరసనగా రేపు చిత్తూరులో దీక్ష మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి చిత్తూరు (కొంగారెడ్డిపల్లె) న్యూస్‌లైన్: జిల్లాలో హంద్రీ - నీవా పనులు, ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులు త్వరితగతిన చేపట్టాలని, ఏపీఎస్ఐడీసీ కార్యాలయాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి తెలిపారు. చిత్తూరులోని జెడ్పీ కార్యాలయం ఎదుట ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ దీక్ష చేస్తానని చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో తాగు, సాగునీటి సమస్యల పరిష్కారానికి 20 ఏళ్లు పోరాడి హంద్రీ - నీవా ప్రాజెక్టును రైతులు సాధించుకున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే దాదాపు 1.65 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందుతుందన్నారు. హంద్రీ - నీవా పనులు ఏళ్ల తరబడి ముందుకు సాగడం లేదన్నారు. దీని కంతటికీ రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరే కారణమన్నారు. పనులు ఆలస్యమవడంతో ప్రభుత్వంపై అధిక భారం పడుతోందన్నారు. కొత్తగా ఇచ్చిన జాబితాల ప్రకారం హంద్రీ - నీవా పనులను జిల్లాలోని గంగాధరనెల్లూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం తదితర నియోజకవర్గాలకు రద్దు చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్ జలాశయం సప్లయ్ చానల్ పనులేమయ్యాయి కలవకుంట వద్దనున్న ఎన్టీఆర్ జలాశయం నుంచి వచ్చే మిగులు జలాల కోసం నిర్మించనున్న సప్లయ్చానల్ పనులేమయ్యాయని జ్ఞానేంద్రరెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ జలాశయం నుంచి సప్లయ్ చానల్స్ ఏర్పాటుచేసి పెనుమూరు, గంగాధరనెల్లూరు మండలాల్లోని చెరువులను అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం నిధులను కేటాయించిందన్నారు. దాదాపు 36 చెరువుల కింద ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే కాకుండా ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించవచ్చన్నారు. అయితే జలాశయం కింద సప్లయ్ చానల్స్ పనులు చేపట్టేందుకు 10 ఏళ్లుగా టెండర్లు పిలవడం, రద్దు చేయడం పరిపాటి అయిందన్నారు. కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితోనే పనులను రద్దు చేశారన్నారు. జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఐడీసీ) కార్యాలయాన్ని పునఃప్రారంభించాలని జ్ఞానేంద్రరెడ్డి డిమాండ్ చేశారు. -
నీళ్లొస్తాయా..రావా?
=తలలు పట్టుకుంటున్న హంద్రీ-నీవా నిర్వాసితులు =ఇప్పుడు నీళ్లురాకుంటే మా పరిస్థితి ఎట్లా..? =కాలువల కోసం10,560 ఎకరాల సేకరణ =మరో పదివేల ఎకరాల సేకరణకు సమాయత్తం =రూ.150 కోట్ల పరిహారం ఇచ్చినా ప్రయోజనం లేదు ‘నమ్ముకున్న పొలాలుపోయినా పర్వాలేదు. కాలువకు నీళ్లొస్తే చాలని ఆశపడ్డాం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తో మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. భూములు లేక.. నీళ్లూరాక ఎలా బతికేది’..? అంటూ జిల్లాలోని ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. బి.కొత్తకోట, న్యూస్‌లైన్: భూములు పోయినా నీళ్లొస్తే చాలని జిల్లాలోని ఏవీ ఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆశపడేవారు. ఇప్పుడు మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తడంతో వారు ఆవేదనకు లోనవుతున్నారు. ప్రాజెక్టుకు 10,560 ఎకరాల అప్పగింత ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, వి ద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన 29 మండలాల్లో 10,500 ఎకరాల భూమిని సేకరిం చారు. మదనపల్లె, పీలేరులో ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టారు. మదనపల్లె కార్యాలయ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో 5,531.33 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,500 మంది రైతుల నుంచి 4,602 ఎకరాలను సేకరిం చారు. దీనికోసం రూ.80 కోట్ల పరిహారం చెల్లిం చారు. పీలేరు కార్యాలయ పరిధిలో 6,967 ఎకరాలకు గానూ, ఇప్పటివరకు 5,958 ఎకరాల సేకరణ పూర్తిచేశారు. 9,811 మందికి రూ.70.48 కోట్ల పరిహారం ఇచ్చారు. 8 ఏళ్లుగా ఉపయోగంలేదు కాలువల కోసం 2006 నుంచి భూ సేకరణ ప్రారంభమైంది. ప్రాజెక్టుకు భూములుపోకుండా ఉంటే అప్పుడప్పుడూ కురిసే వర్షాలకైనా పంటలు పం డేవి. ఇంతకాలం కాలువకు నీరొస్తుందని ఎదురుచూశాం. ఇప్పుడు నీళ్లురాకుంటే మా గతి ఏమిటని అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 10వేల ఎకరాల సేకరణకు సన్నద్ధం జిల్లాలో కాలువల కోసం కాకుండా ఉపకాలువల నిమిత్తం అధికారులు భూ సేకరణకు సిద్ధమవుతున్నారు. ప్రధాన, ఉపకాలువల నుంచి పొలాలకు నీళ్లు పారాలంటే వీటి నుంచి ఉపకాలువలు నిర్మించాలి. ప్రస్తుతం భూసేకరణ యంత్రాంగం దీనిపై చర్యలు చేపట్టింది. దీంతో రైతులు మరో పది వేల ఎకరాలు కోల్పోనున్నట్టు అధికారుల అంచనా. వ్యవసాయం దూరమైంది హంద్రీ - నీవా కాలువ పనులతో భూములు, బోరు కోల్పోవడంతో వ్యవసాయం దూరమైం ది. మా కుటుంబంలో ఏడుగురున్నారు. మాకు నాలుగు ఎకరాల భూ మి ఉంది. నా భర్త రామయ్య వ్యవసాయం చేసేవారు. ఇద్దరు భార్యలు, కుమారుడు, కోడలు, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయంపై ఆధార పడి జీవనం సాగించేవాళ్లం. ఏడాదిలో మూడు సార్లు వరి, వేరుశెనగ పండించేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు, వ్యవసాయ బోరును కోల్పోయాం. -కే.రాజమ్మ, మహిళారైతు, పెద్దమండ్యం ఐదేళ్లుగా నిరీక్షణ హంద్రీ-నీవా కాలువ కోసం మూడున్నర ఎకరాల భూమి కోల్పోయాం. 2.45 ఎకరాల భూమికి పరిహారం మంజూరైంది. మిగిలిన 1.5 ఎకరాలకు పరి హారం ఇవ్వాల్సి ఉంది. అలాగే కొబ్బరి, కానుగ, టేకు, జామ, వేపచెట్లకు రూ.1.45 లక్షల పరిహారం అందాలి. పరిహారం కోసం తహశీల్దార్ వద్ద లెటర్ తెమ్మంటున్నారు. వారి వద్దకు వెళితే ఎండార్స్మెంటే ఇచ్చాం.. మళ్లీ లె టర్ ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు కలెక్టర్లు మారినా మాకు పరిహారం మాత్రం రాలేదు. -పెద్ద గంగులప్ప, రైతు, పెద్దతిప్పసముద్రం