=తలలు పట్టుకుంటున్న హంద్రీ-నీవా నిర్వాసితులు
=ఇప్పుడు నీళ్లురాకుంటే మా పరిస్థితి ఎట్లా..?
=కాలువల కోసం10,560 ఎకరాల సేకరణ
=మరో పదివేల ఎకరాల సేకరణకు సమాయత్తం
=రూ.150 కోట్ల పరిహారం ఇచ్చినా ప్రయోజనం లేదు
‘నమ్ముకున్న పొలాలుపోయినా పర్వాలేదు. కాలువకు నీళ్లొస్తే చాలని ఆశపడ్డాం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తో మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. భూములు లేక.. నీళ్లూరాక ఎలా బతికేది’..? అంటూ జిల్లాలోని ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: భూములు పోయినా నీళ్లొస్తే చాలని జిల్లాలోని ఏవీ ఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆశపడేవారు. ఇప్పుడు మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తడంతో వారు ఆవేదనకు లోనవుతున్నారు.
ప్రాజెక్టుకు 10,560 ఎకరాల అప్పగింత
ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, వి ద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన 29 మండలాల్లో 10,500 ఎకరాల భూమిని సేకరిం చారు. మదనపల్లె, పీలేరులో ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టారు. మదనపల్లె కార్యాలయ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో 5,531.33 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,500 మంది రైతుల నుంచి 4,602 ఎకరాలను సేకరిం చారు. దీనికోసం రూ.80 కోట్ల పరిహారం చెల్లిం చారు.
పీలేరు కార్యాలయ పరిధిలో 6,967 ఎకరాలకు గానూ, ఇప్పటివరకు 5,958 ఎకరాల సేకరణ పూర్తిచేశారు. 9,811 మందికి రూ.70.48 కోట్ల పరిహారం ఇచ్చారు.
8 ఏళ్లుగా ఉపయోగంలేదు
కాలువల కోసం 2006 నుంచి భూ సేకరణ ప్రారంభమైంది. ప్రాజెక్టుకు భూములుపోకుండా ఉంటే అప్పుడప్పుడూ కురిసే వర్షాలకైనా పంటలు పం డేవి. ఇంతకాలం కాలువకు నీరొస్తుందని ఎదురుచూశాం. ఇప్పుడు నీళ్లురాకుంటే మా గతి ఏమిటని అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో 10వేల ఎకరాల సేకరణకు సన్నద్ధం
జిల్లాలో కాలువల కోసం కాకుండా ఉపకాలువల నిమిత్తం అధికారులు భూ సేకరణకు సిద్ధమవుతున్నారు. ప్రధాన, ఉపకాలువల నుంచి పొలాలకు నీళ్లు పారాలంటే వీటి నుంచి ఉపకాలువలు నిర్మించాలి. ప్రస్తుతం భూసేకరణ యంత్రాంగం దీనిపై చర్యలు చేపట్టింది. దీంతో రైతులు మరో పది వేల ఎకరాలు కోల్పోనున్నట్టు అధికారుల అంచనా.
వ్యవసాయం దూరమైంది
హంద్రీ - నీవా కాలువ పనులతో భూములు, బోరు కోల్పోవడంతో వ్యవసాయం దూరమైం ది. మా కుటుంబంలో ఏడుగురున్నారు. మాకు నాలుగు ఎకరాల భూ మి ఉంది. నా భర్త రామయ్య వ్యవసాయం చేసేవారు. ఇద్దరు భార్యలు, కుమారుడు, కోడలు, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయంపై ఆధార పడి జీవనం సాగించేవాళ్లం. ఏడాదిలో మూడు సార్లు వరి, వేరుశెనగ పండించేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు, వ్యవసాయ బోరును కోల్పోయాం.
-కే.రాజమ్మ, మహిళారైతు, పెద్దమండ్యం
ఐదేళ్లుగా నిరీక్షణ
హంద్రీ-నీవా కాలువ కోసం మూడున్నర ఎకరాల భూమి కోల్పోయాం. 2.45 ఎకరాల భూమికి పరిహారం మంజూరైంది. మిగిలిన 1.5 ఎకరాలకు పరి హారం ఇవ్వాల్సి ఉంది. అలాగే కొబ్బరి, కానుగ, టేకు, జామ, వేపచెట్లకు రూ.1.45 లక్షల పరిహారం అందాలి. పరిహారం కోసం తహశీల్దార్ వద్ద లెటర్ తెమ్మంటున్నారు. వారి వద్దకు వెళితే ఎండార్స్‌మెంటే ఇచ్చాం.. మళ్లీ లె టర్ ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు కలెక్టర్లు మారినా మాకు పరిహారం మాత్రం రాలేదు.
-పెద్ద గంగులప్ప, రైతు, పెద్దతిప్పసముద్రం
నీళ్లొస్తాయా..రావా?
Published Mon, Dec 9 2013 3:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement
Advertisement