
ఆడియో ఫంక్షన్‌కు రావాలని పిలిస్తే రూ.2 లక్షలు డిమాండ్ చేశాడంటూ సీనియర్ హీరో సుమన్‌పై దర్శకుడు శివనాగు సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే! తాజాగా అతడు ఈ వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు. ‘నటరత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్ వేదికగా సుమన్‌పై చేసిన వ్యాఖ్యలకు శివనాగు క్షమాపణ తెలిపారు. దీనిపై అసలేం జరిగిందో క్లారిటీ ఇస్తూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
ఇందులో శివనాగు మాట్లాడుతూ ‘‘సుమన్‌గారు నా కుటుంబానికి ఎంతో కావాల్సిన వ్యక్తి. ఆయనతో మూడు సినిమాలు చేశాను. నా పిల్లలు ఇద్దరు నిర్మిస్తున్న ‘నట రత్నాలు’ చిత్రం ఆడియో ఫంక్షన్‌కు ఆయన్ని ఆహ్వానించి, సన్మానించాలనుకున్నాను. ఆయన్ను పిలిచే క్రమంలో మేకప్‌మెన్ వెంకట్రావు చెప్పడం సమస్యో, నేను వినడం పొరపాటో తెలీదు కానీ ఫంక్షన్ టెన్షన్‌లో ఉండి సుమన్‌గారిపై ఆరోపణలు చేశాను. దీనిపై చాలామంది నిర్మాతలు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అప్పుడు గానీ నేను పొరపాటు మాట్లాడానని గమనించలేదు. మీడియా ముఖంగా సుమన్‌గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుతున్నా’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment