సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ చానళ్లో వీడియో దర్శనిమిస్తున్నాయి. ఇక పలు ఉత్తరాది యూట్యూబ్ చానల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అదేంటి ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఏంటని, ఇది నిజమా? కాదా? అంటూ తెలుగు రాష్ట్రాల అభిమానులంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఈ వార్తలపై స్పందించారు.
చదవండి: వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి
తాను పూర్తి ఆరోగ్యం ఉన్నానని, తన గురించి, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తమిళ మీడియా ద్వారా ఆయన ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న పూకార్లపై ఆయన మండిపడ్డారు. ‘నేను పూర్తి ఆరోగ్యం ఉన్నా. సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం బెంగళూరులో నా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఇలా నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’ అని సుమన్ అన్నారు.
చదవండి: హీరోయిన్ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు!
అనంతరం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన సదరు యూట్యూబ్ చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ సుమన్ ధ్వజమెత్తారు. కాగా నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా, సహానటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించారు. తన సినీ కెరీర్‌లో సుమన్ దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment