health rumours
-
విషమంగా హీరో సుమన్ ఆరోగ్యం?!.. క్లారిటీ ఇచ్చిన నటుడు
సినీ నటుడు, అలనాటి హీరో సుమన్ ఆరోగ్యం విషమంగా ఉందంటూ కొద్ది రోజులుగా పలు యూట్యూబ్ చానళ్లో వీడియో దర్శనిమిస్తున్నాయి. ఇక పలు ఉత్తరాది యూట్యూబ్ చానల్స్ అయితే ఏకంగా ఆయన ఇకలేరంటూ వీడియోలతో ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ అంతా షాకయ్యారు. అదేంటి ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఏంటని, ఇది నిజమా? కాదా? అంటూ తెలుగు రాష్ట్రాల అభిమానులంత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న సుమన్ ఈ వార్తలపై స్పందించారు. చదవండి: వెండితెరపై వినాయక విన్యాసాలు.. ఈ సినిమాలపై ఓ లుక్కేయండి తాను పూర్తి ఆరోగ్యం ఉన్నానని, తన గురించి, తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ తమిళ మీడియా ద్వారా ఆయన ప్రకటన ఇచ్చారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం పట్ల వస్తున్న పూకార్లపై ఆయన మండిపడ్డారు. ‘నేను పూర్తి ఆరోగ్యం ఉన్నా. సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొంటున్నాను. ప్రస్తుతం బెంగళూరులో నా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ క్రమంలో నా ఆరోగ్యంపై ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నా సన్నిహితుల ద్వారా నాకు తెలిసింది. అందుకే ఇలా నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది’ అని సుమన్ అన్నారు. చదవండి: హీరోయిన్ అమలాపాల్‌కు లైంగిక వేధింపులు! అనంతరం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన సదరు యూట్యూబ్ చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ సుమన్ ధ్వజమెత్తారు. కాగా నాలుగు దశాబ్ధాలుగా సినీ పరిశ్రమలో ఆయన ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. తెలుగు, తమిళంలో హీరోగా, సహానటుడిగా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన ఆయన మలయాళం, కన్నడలో సైతం పలు చిత్రాల్లో నటించారు. తన సినీ కెరీర్లో సుమన్ దాదాపు 150పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆయన ఐక్యూ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన పోలీసు అధికారిగా కనిపించనున్నారు. -
కేసీఆర్ ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం, అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లుక్ ఔట్ నోటీస్ ద్వారా రాజు అనే యువకుడిని ముంబై ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజు సౌదీ అరేబియాలో ఉంటూ జూన్‌లో కేసీఆర్ ఆరోగ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకిందని, దాన్ని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారని అసత్య ఆరోపణలు చేశారు. దీంతో ఆతనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్ కస్టడికి పంపారు. -
‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’
లాక్డౌన్ విధించిన నాటి నుంచి సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఆరోగ్యానికి సంబంధించిన రుమార్లు తెగ ప్రచారం అవుతున్నాయి. ఫలానా నటి / నటుడు అనారోగ్యం పాలయ్యారని.. ఆస్పత్రిలో చేరారంటూ పుకార్లు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే. చివరకు సదరు వ్యక్తి స్వయంగా తెర మీదకు వచ్చి.. నాకేమి కాలేదు.. ఆరోగ్యంగా ఉన్నాను అంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని కూడా ఈ పుకార్ల బారిన పడ్డారు. ఆమె ఆరోగ్యం బాగాలేదు.. ఆస్పత్రిలో చేరారనే వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరలయ్యాయి. దాంతో అభిమానులు, సన్నిహితుల నుంచి ఒకటే ఫోన్లు. ఈ బాధ తట్టుకోలేక చివరికి ‘నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు హేమ మాలిని. (ఆయనతోనే జీవితం అనుకున్నా.. అందుకే..) View this post on Instagram Dear All, Thank you so much for showing your concern. I am absolutely fine with the blessing of Lord Krishna. Radhey Radhey. You all stay home, stay safe. A post shared by Dream Girl Hema Malini (@dreamgirlhemamalini) on Jul 11, 2020 at 11:20pm PDT ‘నేను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా వార్తలు వస్తోన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నా అభిమానులు, నా మంచి కోరే వారికి ఓ విషయం తెలియజేయాలనుకున్నాను. అవన్నీ రూమర్స్. నాకు ఏమీ కాలేదు. చాలా ఆరోగ్యంగా ఉన్నాను. దేవుడి దయతో అంతా బాగానే ఉంది’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు హేమ మాలిని. 28 సెకన్ల నిడివి కలిగిన వీడియోను తన ఇంటి నుంచే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే హేమ మాలిని ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందే ఈ వార్తలపై ఆమె కూతురు ఈషాడియోల్ స్పందించారు. తన తల్లి డ్రీమ్ గర్ల్ హేమ మాలిని పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాక హేమ మాలిని ఆరోగ్యంపై ఆందోళన చెందిన అభిమానులకు, తమ పట్ల చూపిస్తోన్న ప్రేమకు ఈషా డియోల్ కృతజ్ఞతలు తెలిపారు.(నాన్నా! నేనున్నాను!!) My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼 — Esha Deol (@Esha_Deol) July 12, 2020 -
చొక్కా లేకుండా కండలు చూపుతూ.. ట్వీట్!
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై వదంతులు వస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ట్విటర్లో ఒక అరుదైన ఫొటోను పోస్ట్ చేశారు. చొక్కా లేకుండా కండలు తిరిగిన బాక్సర్ దేహంతో ఫొటోషాప్ చేసిన తన ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. గత శనివారం ట్రంప్ ఆకస్మికంగా వాషింగ్టన్ బయట ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై ఆగ్రహంతో ఉన్న ట్రంప్ తాను ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉన్నానని చాటేందుకు, వదంతులకు చెక్ పెట్టేందుకు ఈ ఫొటోషాప్ ఫొటోను ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. మంచి దిట్టమైన కండలతో కూడిన బాక్సర్ బాడీకి ట్రంప్ మొఖాన్ని సూపర్ఇంపోజ్ చేసి ఈ ఫొటోను రూపొందించారు. సిల్వెస్టర్ స్టాలోన్ సినిమా ‘రాకీ 3’ పోస్టర్లో వాడిన ఛాతిభాగాన్ని ఈ ఫొటోలో ఫొటోషాప్ కోసం వాడారు. ఈ కండులు తిరిగిన దేహంపై 73 ఏళ్ల ట్రంప్ ముఖాన్ని ఒకింత బ్యూటీఫై చేసి అటాచ్ చేశారు. తన శారీరక దారుఢ్యం గురించి చెప్పేందుకు ట్రంప్ ఏనాడూ సిగ్గుపడింది లేదు. ఇతర వ్యక్తుల శారీరక ఆకృతి గురించి పొగుడుతూనే, వ్యంగ్యంగానే ఆయన అధికారిక కార్యక్రమాల్లో వ్యాఖ్యలు చేసేవారు. గత మంగళవారం ఫ్లోరిడాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. మీడియా తీరుపై మండిపడ్డారు. తనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో వాల్టర్ రీడ్ మిలిటరీ ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ ప్రధాన మీడియా సంస్థలు తప్పుడు కథనాలు ప్రచురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
త్రిష ఆరోగ్యంపై వదంతులే!
హీరోయిన్ త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, ఆమె ఆస్పత్రిలో చేరారనే ప్రచారం చిత్రపరిశ్రమలో కలకలానికి దారి తీసింది. మూడు పదుల వయసులోనూ.. నటిగా బిజీగా ఉన్న ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో మోహిని, గర్జన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కాగా మిగిలినవి కమర్షియల్ నాయకి పాత్రలు. వీటిలో ఒక మలయాళ చిత్రం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో త్రిష అనారోగ్యానికి గురైయ్యారని, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వార్తలు మంగళవారం గుప్పుమన్నాయి. దీంతో పలువురు అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వారు పత్రిక కార్యాలయాలు ఫోన్ చేసి వివరణ కోరడం జరిగింది. దీంతో కోలీవుడ్‌లో కలకలమే చెలరేగింది. అయితే అవన్నీ వదంతులేనని త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు. త్రిషపై వచ్చిన ప్రచారంలో నిజం లేదని, ఆమె ఆరోగ్యంగా ఉందని, ప్రస్తుతం మలేషియాలో అరవిందస్వామికి జంటగా సతురంగవేట్టై–2 చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారని వెల్లడించారు.