సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లుక్ ఔట్ నోటీస్ ద్వారా రాజు అనే యువకుడిని ముంబై ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాజు సౌదీ అరేబియాలో ఉంటూ జూన్‌లో కేసీఆర్ ఆరోగ్యపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు కరోనా వైరస్ సోకిందని, దాన్ని గాంధీ ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారని అసత్య ఆరోపణలు చేశారు.
దీంతో ఆతనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. సైబర్ క్రైమ్ పోలీసులు రాజును ముంబై నుంచి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్ కస్టడికి పంపారు.
Comments
Please login to add a commentAdd a comment